ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వెలుగులో కుంభకోణం

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:45 AM

డ్వాక్రా సంఘాలకు మంజూరైన రుణాలను వారికి తెలియకుండానే బ్యాంకు నుంచి డ్రా చేశారు. మరోవైపు ఇతర సంఘాలు తీసుకున్న రుణాలకు సంబంధించి వాయిదాల చెల్లింపునకు సభ్యుల నుంచి నెలనెలా వసూలు చేసిన సొమ్ములను బ్యాంకుకు జమ చేయకుండా స్వాహాచేశారు. దాదాపు రూ.40 లక్షల మింగేసిన వెలుగు వీవోఏ (విలేజ్‌ ఆర్గనైజింగ్‌ అసిస్టెంట్‌) వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. బాఽధిత మహిళలంతా వ్యవసాయ కూలీ కుటుంబాలకు చెందిన వారు కావడం, అక్షరజ్ఞానం లేనివారు కావడంతో వీవోఏ మోసగించినట్టు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడడంతో మండలంలోని సింహాద్రిపురం పంచాయతీకి చెందిన పలువురు మహిళలు మంగళవారం వీవోఏను పట్టుకుని నిలదీశారు. అనంతరం వెలుగు అధికారులను, పోలీసులను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి బాధిత డ్వాక్రా సభ్యులు చెప్పిన వివరాలిలా వున్నాయి.

గోవాడ స్టేట్‌ బ్యాంకు వద్దకు వచ్చిన డ్వాక్రా మహిళలు

డ్వాక్రా సంఘాల సొమ్ము స్వాహా చేసిన వీవోఏ

సభ్యులకు తెలియకుండానే బ్యాంకు నుంచి రుణాలు

మరికొన్ని సంఘాల రుణ వాయిదాల డబ్బులు పక్కదారి

రూ.40 లక్షలకుపైగా మింగేసినట్టు ఆరోపణలు

అధికారులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు

చోడవరం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): డ్వాక్రా సంఘాలకు మంజూరైన రుణాలను వారికి తెలియకుండానే బ్యాంకు నుంచి డ్రా చేశారు. మరోవైపు ఇతర సంఘాలు తీసుకున్న రుణాలకు సంబంధించి వాయిదాల చెల్లింపునకు సభ్యుల నుంచి నెలనెలా వసూలు చేసిన సొమ్ములను బ్యాంకుకు జమ చేయకుండా స్వాహాచేశారు. దాదాపు రూ.40 లక్షల మింగేసిన వెలుగు వీవోఏ (విలేజ్‌ ఆర్గనైజింగ్‌ అసిస్టెంట్‌) వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. బాఽధిత మహిళలంతా వ్యవసాయ కూలీ కుటుంబాలకు చెందిన వారు కావడం, అక్షరజ్ఞానం లేనివారు కావడంతో వీవోఏ మోసగించినట్టు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడడంతో మండలంలోని సింహాద్రిపురం పంచాయతీకి చెందిన పలువురు మహిళలు మంగళవారం వీవోఏను పట్టుకుని నిలదీశారు. అనంతరం వెలుగు అధికారులను, పోలీసులను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి బాధిత డ్వాక్రా సభ్యులు చెప్పిన వివరాలిలా వున్నాయి.

చోడవరం మండలం సింహాద్రిపురం పంచాయతీ పరిధిలోని శివారు పాతిక గ్రామానికి చెందిన రెండు డ్వాక్రా గ్రూపులకు ఇటీవల రూ.15 లక్షల రుణం మంజూరైంది. దీనికి సంబంధించిన డబ్బులు గోవాడ స్టేట్‌ బ్యాంకులో ఆయా గ్రూపుల మహిళల ఖాతాల్లో జమ అయ్యాయి. అయితే స్థానిక వీవోఏఈ విషయాన్ని డ్వాక్రా సభ్యులకు తెలియపరచకుండా, వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేసి సొంతానికి వాడుకున్నది. అసలు రుణం మంంజూరైన విషయం కూడా సదరు డ్వాక్రా సంఘాల సభ్యులకు తెలియజేయలేదు. మరోవైపు ఇదే పంచాయతీలో మరికొన్ని డ్వాక్రా గ్రూపులు గతంలో మంజూరైన రుణాలకు సంబంధించి ప్రతినెలా చెల్లించే వాయిదాల సొమ్ములను బ్యాంకులో జమచేయకుండా స్వాహా చేసినట్టు పలువురు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు సభ్యులు వీవోఏను గట్టిగా నిలదీయడంతో ఈ వ్యవహారం బయటపడినట్టు చెబుతున్నారు. రుణాల సొమ్ముతోపాటు రుణ వాయిదాల చెల్లింపు సొమ్ము వీవోఏ స్వాహా చేసిన విషయం వె లుగులోకి రావడంతో సింహాద్రిపురం పంచాయతీ పరిధిలోని డ్వాక్రా మహిళలు మంగళవారం గోవాడలోని స్టేట్‌ బ్యాంకుకు వెళ్లారు. రుణాలు, చెల్లింపుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాము తీసుకున్న రుణాలకు, తిరిగి చెల్లిస్తున్న బకాయిలకు మధ్య చాలా వ్యత్యాసం ఉండడంతో తమను మోసగించావంటూ వీవోఏను పట్టుకుని నిలదీశారు. అంతటితో ఆగకుండా వెలుగు కార్యాలయానికి, పోలీస్‌ స్టేషన్‌కు తీసుకుని వెళ్లి చేసిన మోసాన్ని వివరించారు. దీంతో వెలుగు అధికారులు గోవాడ స్టేట్‌ బ్యాంకుకు వెళ్లి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మొత్తం మీద సింహాద్రిపురం పంచాయతీలో వీవోఏ 40 లక్షల రూపాయలకుపైగానే నిధులు స్వాహా చేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని వెలుగు ఏపీఎం డీవీ తిలక్‌ దృష్టికి తీసుకెళ్లగా, సింహాద్రిపురం వీవోఏ అక్రమాలకు పాల్పడినట్టు డ్వాక్రా సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై గోవాడ స్టేట్‌ బ్యాంకుకు తమ సిబ్బందిని పంపించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.

బ్యాంకు అధికారుల పాత్రపై అనుమానాలు

డ్వాక్రా సంఘాల రుణాలకు సంబంధించి వెలుగు వీవోఏ నిధుల స్వాహా వ్యవహారంపై గోవాడ స్టేట్‌ బ్యాంకు అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సభ్యుల సంతకాలు లేకుండా వారి ఖాతాల్లో నుంచి డబ్బులు ఎలా డ్రా చేశారన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఈ వ్యవహారంలో వీవోఏకు సహకరించిన బ్యాంకు ఉద్యోగులపైనా విచారణ జరిపిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

రూ.20 లక్షలకు లెక్కలు తేలడంలేదు

ముసోడ గంగమ్మ, సింహాద్రిపురం

మా గ్రూపునకు గతంలో నాలుగు లక్షల రూపాయల రుణం మంజూరైంది. దీనికి సంబంధించి ప్రతి నెలా వాయిదాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు 2 లక్షల 80 వేల రూపాయల మేర బాకీ తీర్చేశాం. బ్యాంకుకు వెళ్లి వాకబు చేస్తే 80 వేల రూపాయలు మాత్రమే కట్టినట్టు ఉంది. మిగిలిన రెండు లక్షల రూపాయల గురించి వీవోఏను అడిగితే సమాధానం చెప్పడంలేదు. మా గ్రామంలో ఐదు గ్రూపులకు సంబంధించి సుమారు 20 లక్షల రూపాయల మేర లెక్కలు తేలడం లేదు.

Updated Date - Nov 13 , 2024 | 12:45 AM