ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇసుక కొరతకు తెర!

ABN, Publish Date - Nov 22 , 2024 | 12:45 AM

జిల్లాలో భవన నిర్మాణదారులకు ఇసుక కొరత సమస్య త్వరలో తీరనున్నది. నూతన ఇసుక పాలసీని పక్కాగా అమలు చేయడం ద్వారా భవన నిర్మాణదారులకు ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇసుక యార్డుల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నది. దీంతో ఇసుక అందుబాటులోకి రావడంతోపాటు అక్రమ తవ్వకాలు, రవాణాకు చెక్‌ పడుతుంది.

అనకాపల్లి సమీపంలో గతంలో ఏర్పాటు చేసిన ఇసుక డిపో (ఫైల్‌ ఫొటో)

త్వరలో నిల్వ యార్డులు

ఆరుచోట్ల ఏర్పాటుకు టెండర్లు

ప్రైవేటు వ్యక్తులకు నిర్వహణ బాధ్యతలు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో భవన నిర్మాణదారులకు ఇసుక కొరత సమస్య త్వరలో తీరనున్నది. నూతన ఇసుక పాలసీని పక్కాగా అమలు చేయడం ద్వారా భవన నిర్మాణదారులకు ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇసుక యార్డుల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నది. దీంతో ఇసుక అందుబాటులోకి రావడంతోపాటు అక్రమ తవ్వకాలు, రవాణాకు చెక్‌ పడుతుంది.

జిల్లాలోని నదుల్లో తగినంత ఇసుక నిల్వలు లేని కారణంగా రీచ్‌లకు పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వలేదు. దీంతో జిల్లాలో భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుకను అటు తూర్పుగోదావరి జిల్లా, ఇటు శ్రీకాకుళం జిల్లాలోని గోదావరి, వంశధార, నాగవళి నదుల నుంచి రప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు వ్యాపారులు ఆయా నదుల నుంచి ఇసుక తీసుకువచ్చి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో వ్యక్తిగత అవసరాలకు స్థానిక నదుల్లో ఉచితంగా ఇసుక తవ్వుకొని ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై తీసుకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించింది. ఇదే అదనుగా భావించిన కొంతమంది అక్రమార్కులు నదుల్లో ఎడాపెడా ఇసుక తవ్వకాలు జరుపుతూ దర్జాగా అమ్ముకుంటున్నారు. పగలు నదుల్లో ఇసుకను తవ్వి ఎడ్ల బండ్లతో సమీపంలో కుప్పలుగా పోస్తున్నారు. చీకటి పడిన తరువాత ట్రాక్టర్లు, లారీల్లో ఇసుక రవాణా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇది కూడా ప్రభుత్వం దృష్టికి రావడంతో ఇసుక డిపోలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

జిల్లాలో ఆరు ఇసుక నిల్వ యార్డులు

జిల్లాలో కొత్తగా ఇసుక నిల్వ యార్డుల ఏర్పాటుకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అనుమతి ఇచ్చారు. అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, నక్కపల్లి, అచ్యుతాపురంలో ఇసుక నిల్వ యార్డులను ఏర్పాటు చేసేందుకు టెండర్లు ప్రక్రియ మొదలైంది. ఆయా ప్రదేశాల్లో కనీసం నాలుగు ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులో వున్న వారు ఇసుక డిపో నిర్వహణకు దరఖాస్తు చేసుకోవాలి. గనుల శాఖ అధికారులు జిల్లా ఇసుక కమిటీ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. వారికి మినరల్‌ డీలర్‌ లైసెన్స్‌ జారీ చేసి, ఇసుక నిల్వ యార్డులను నిర్వహణను అప్పగిస్తారు.

Updated Date - Nov 22 , 2024 | 12:46 AM