ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తీరనున్న డోలీమోతల వెతలు

ABN, Publish Date - Nov 21 , 2024 | 11:45 PM

మండలంలోని మారుమూల గుమ్మ పంచాయతీ కడరేవ్‌, కర్రీగుడ, నిమ్మఊట గ్రామాల ప్రజలకు డోలీమోతల కష్టాలు తీరనున్నాయి. కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ చొరవతో ఆయా గ్రామాలకు రహదారి నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యాయి. దీంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నేరలపూడి నుంచి నిమ్మఊట వరకు చేపడుతున్న రోడ్డు పనులు

కలెక్టర్‌ చొరవతో నేరలపూడి నుంచి నిమ్మఊట గ్రామం వరకు రహదారి పనులు

గిరిజనుల హర్షం

అనంతగిరి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల గుమ్మ పంచాయతీ కడరేవ్‌, కర్రీగుడ, నిమ్మఊట గ్రామాల ప్రజలకు డోలీమోతల కష్టాలు తీరనున్నాయి. కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ చొరవతో ఆయా గ్రామాలకు రహదారి నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యాయి. దీంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ నేరలపూడి నుంచి కొట్టంగుడ మీదుగా కడరేవ్‌ వరకు జీఎస్‌బీ(గ్రాన్యుయర్‌ సబ్‌ బేస్‌) రోడ్డు, అక్కడ నుంచి కర్రీగుడ మీదుగా నిమ్మఊట వరకు డబ్ల్యూబీఎం(వాటర్‌ బౌండ్‌ మెకాడామ్‌) రోడ్డు పనులకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2024 జూలై నెలలో రూ.6.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కొంతవరకు పనులు జరిగినప్పటికీ అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో పనులను నిలిపివేశారు. అయితే ఆగస్టు నెలలో జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తెలిపిన వెంటనే క్షేత్రస్థాయిలో ప్రొసీడింగ్‌ కాపీ అందకపోవడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. ఈ విషయం కలెక్టర్‌ దృష్టికి రావడంతో నిధులు మంజూరైనా రహదారి నిర్మాణ పనులు జరగకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఆయన వెంటనే స్పందించి అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. దీంతో రహదారి నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యాయి. తమ కష్టాలను గుర్తించిన కలెక్టర్‌, ఐటీడీఏ పీవోలకు గిరిజనులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Updated Date - Nov 21 , 2024 | 11:45 PM