ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంటింటా సౌర వెలుగులు!

ABN, Publish Date - Nov 16 , 2024 | 12:31 AM

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా ‘సౌర శక్తి’ వెలుగులు ప్రకాశించనున్నాయి. ఇంటి పైకప్పుపై కనీసం 100 చదరపు అడుగుల స్థలంలో ఒక కిలోవాట్‌ సామర్థ్యంతో సౌర విద్యుదుత్పత్తి యూనిట్‌ను అమర్చుకోవచ్చు. సౌర విద్యుత్‌ ప్యానల్స్‌, ఇతర సామగ్రి విలువపై ఒకటి, రెండు కిలోవాట్‌లు అయితే 60 శాతం, మూడు కిలోవాట్‌లకు మించితే 40 శాతం రాయితీని ప్రభుత్వం ఇస్తున్నది. లబ్ధిదారులు తమ వాటా సొమ్మును బ్యాంకుల నుంచి రుణంగా పొందే వెసులుబాటు కూడా వుంది.

పీఎం సూర్యఘర్‌ పథకం కింద అనకాపల్లి మండలంలో ఒక ఇంటిపై అమర్చిన సోలార్‌ ప్యానల్స్‌

పీఎం సూర్యఘర్‌ పథకం కింద సోలార్‌ రూఫ్‌టాప్‌

ఇంటి కప్పుపై కనీసం 100 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు..

కనీసం ఒక కిలోవాట్‌ సామర్థ్యం

యూనిట్‌ విలువలో రూ.30 వేలు సబ్సిడీ

రెండు కిలోవాట్‌లు అయితే రూ.60 వేలు..

మూడు, అంతకన్నా ఎక్కువ కిలోవాట్‌లకు రూ.78 వేలు రాయితీ

మిగిలిన సొమ్ము బ్యాంకుల నుంచి రుణంగా పొందే వెసులుబాటు

సామాన్యులపై భారీగా తగ్గనున్న కరెంటు బిల్లు భారం

మిగులు విద్యుత్తుతో అదనపు ఆదాయం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా ‘సౌర శక్తి’ వెలుగులు ప్రకాశించనున్నాయి. ఇంటి పైకప్పుపై కనీసం 100 చదరపు అడుగుల స్థలంలో ఒక కిలోవాట్‌ సామర్థ్యంతో సౌర విద్యుదుత్పత్తి యూనిట్‌ను అమర్చుకోవచ్చు. సౌర విద్యుత్‌ ప్యానల్స్‌, ఇతర సామగ్రి విలువపై ఒకటి, రెండు కిలోవాట్‌లు అయితే 60 శాతం, మూడు కిలోవాట్‌లకు మించితే 40 శాతం రాయితీని ప్రభుత్వం ఇస్తున్నది. లబ్ధిదారులు తమ వాటా సొమ్మును బ్యాంకుల నుంచి రుణంగా పొందే వెసులుబాటు కూడా వుంది.

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు ఎడాపెడా పెంచడమే కాకుండా సౌర విద్యుత్తును అందుబాటులో తేవడంలో పూర్తి నిర్లక్ష్యం వహించింది. దీంతో విద్యుత్‌ వినియోగదారులపై మరో ఏడాదిన్నర వరకు చార్జీల సర్దుబాటు పేరుతో అదనపు భారం తప్పేటట్టు లేదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివాస గృహాలపై సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు శ్రీకారం చుట్టింది. విద్యుత్‌ వినియోగ చార్జీల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘పీఎం సూర్య ఘర్‌’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి. దీనివల్ల తక్కువ ఖర్చుతో దీర్ఘ కాలంపాటు విద్యుత్తును పొందవచ్చు. సౌర విద్యుత్‌ పరికరాల వ్యయంలో కొంతమొత్తాన్ని ప్రభుత్వాలు రాయితీగా ఇస్తున్నాయి. ఉత్పత్తి అయిన విద్యుత్‌ కన్నా, గృహ వినియోగం తక్కువగా వుంటే.. అదనపు విద్యుత్‌ను డిస్కమ్‌లు తీసుకుని, వినియోగదారునికి డబ్బులు చెల్లిస్తాయి. దీనివల్ల అదనపు ఆదాయం పొందే అవకాశం వుంది.

పరికరాల వ్యయంపై 40-60 శాతం రాయితీ

ఒక కిలోవాట్‌ సామర్థ్యం కలిగిన సోలార్‌ రూఫ్‌టాప్‌ను అమర్చుకోవాలంటే ఇంటి పైకప్పుపై కనీసం 100 చదరపు అడుగుల స్థలం వుండాలి. ఒక కిలోవాట్‌ విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్‌కు రూ.30 వేలు, రెండు కిలోవాట్స్‌కు అయితే రూ.60 వేలు, మూడు కిలోవాట్స్‌ అంతకాన్న ఎక్కువ వుంటే రూ.78 వేలు రాయితీగా ప్రభుత్వం అందిస్తుంది. ఉదాహరణకు మూడు కిలోవాట్స్‌ సోలార్‌ రూఫ్‌టాప్‌ను ఏర్పాటు చేసుకోడానికి రూ.1.5 లక్షలు ఖర్చు అయితే అందులో రూ.78 వేలు కేంద్ర ప్రభుత్వం రాయితీగా అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణంగా పొందవచ్చు. నెలకు 150 యూనిట్లకు లోబడి విద్యుత్‌ వినియోగించే వారికి ఒకటి కిలోవాట్‌, 150 యూనిట్లకు పైబడి 300 యూనిట్లకు లోపు విద్యుత్‌ వినియోగించే వారికి రెండు కిలోవాట్స్‌, 300 యూనిట్లకంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగించే వారికి మూడు కిలోవాట్స్‌ సామర్థ్యం కలిగిన సోలార్‌ యూనిట్లు అవసరం అవుతాయి. మూడు కన్నా ఎక్కువ కిలోవాట్స్‌ సామర్థ్యం వున్న సోలార్‌ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నప్పటికీ గరిష్ఠంగా రూ.78 వేలు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది.

రిజిస్ట్రేషన్‌...

పీఎం సూర్యఘర్‌ యోజన కింద ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్‌ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలనుకొనేవారు ఏపీ ఈపీడీసీఎల్‌ వెబ్‌సైట్‌ ద్వారా పీఎం సూర్యఘర్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. తొలుత తమ పేరును పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆప్షన్‌ ఎంచుకుని ఏపీఈపీడీసీఎల్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి. లాగిన్‌ అయ్యాక రూఫ్‌టాప్‌ సొలార్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. యూనిట్‌ ఏర్పాటుకు అనుమతి ఆన్‌లైన్‌లో రాగానే నమోదిత సోలార్‌ వెండర్స్‌ నుంచి సోలార్‌ యూనిట్‌ను పొందవచ్చు. సోలార్‌ ప్లేట్ల అమరిక పూర్తయిన తరువాత నెట్‌ మీటరు అమర్చుతారు. తరువాత ఈపీడీసీఎల్‌ అధికారులు తనిఖీ చేసి ధ్రువీకరిస్తారు. అనంతరం బ్యాంకు ఖాతా వివరాలు అందిస్తే, నెల రోజుల్లో లబ్ధిదారుని బ్యాంకు ఖతాలో రాయితీ సొమ్ము జమ అవుతుంది.

మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం

పీఎం సూర్యఘర్‌ యోజనతో మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరగుతుంది. సోలార్‌ రూఫ్‌ టాప్‌ పరికరాలకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. మిగిలిన సొమ్మును బ్యాంకుల నుంచి రుణంగా పొందవచ్చు. పీఎం సూర్యఘర పథకం వివరాలు తెలుసుకోవాలనుకొనేవారు మండల అభివృద్ధి అధికారి లేదా ఈపీడీసీఎల్‌ మండల అధికారులను సంప్రదించాలి.

నిరంతర ప్రక్రియ

జి.ప్రసాద్‌, ఎస్‌ఈ, ఈపీడీసీఎల్‌, అనకాపల్లి

పీఎం సూర్యఘర్‌ పథకానికి దరఖాస్తు చేయడానికి గడువు అంటూ ఏమీ లేదు. జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించాం. శుక్రవారం నాటికి 1,852 దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్టర్‌ అయ్యాయి వీటిలో 197 యూనిట్లను ఇప్పటికే ఏర్పాటు చేశాం.

Updated Date - Nov 16 , 2024 | 12:31 AM