రాత్రంతా జాగారం
ABN, Publish Date - May 15 , 2024 | 01:05 AM
పోలింగ్ రోజు సోమవారం రాత్రి సైతం ఎన్నికల సిబ్బంది, అధికారులకు జాగరణ తప్పలేదు. గతంలో పోలింగ్ రోజు ఏదో సమయంలో ఈవీఎంలను అప్పగించడం, అదే రోజు అర్ధరాత్రి ఈవీఎంలను స్ర్టాంగ్ రూముల్లో భద్రపరచడం జరిగేది. కానీ ఈసారి అందుకు భిన్నంగా సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సమయం అయినప్పటికీ అధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో పలు కేంద్రాల్లో రాత్రి తొమ్మిది గంటల వరకు పోలింగ్ నిర్వహించిన పరిస్థితులున్నాయి.
- సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు కొనసాగిన ఈవీఎంల అప్పగింత
- పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తడమే కారణం
- అరకులోయ ఎంపీ, పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల ఈవీఎంలు వేర్వేరుగా స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరిచిన అఽధికారులు
- విజయవంతంగా పోలింగ్ నిర్వహించడంపై సిబ్బందికి అధికారుల అభినందనలు
(ఆంధ్రజ్యోతి- పాడేరు)
పోలింగ్ రోజు సోమవారం రాత్రి సైతం ఎన్నికల సిబ్బంది, అధికారులకు జాగరణ తప్పలేదు. గతంలో పోలింగ్ రోజు ఏదో సమయంలో ఈవీఎంలను అప్పగించడం, అదే రోజు అర్ధరాత్రి ఈవీఎంలను స్ర్టాంగ్ రూముల్లో భద్రపరచడం జరిగేది. కానీ ఈసారి అందుకు భిన్నంగా సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సమయం అయినప్పటికీ అధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో పలు కేంద్రాల్లో రాత్రి తొమ్మిది గంటల వరకు పోలింగ్ నిర్వహించిన పరిస్థితులున్నాయి. పాడేరు అసెంబ్లీ స్థానం పరిధిలో 318, అరకులోయ అసెంబ్లీ స్థానం పరిధిలోని 304 పోలింగ్ కేంద్రాల నుంచి మొత్తం ఈవీఎంలను జిల్లా కేంద్రం పాడేరులో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్ రూముల్లోనే భద్రపరచాల్సిన ఉంది. దీంతో ఆ రెండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని పాడేరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్లలోనే అప్పగించాల్సి ఉంది. దీంతో సోమవారం పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి మంగళవారం తెల్లవారుజాము మూడు గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని తీసుకువచ్చారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఈవీఎంలు, సామగ్రిని స్వీకరించి, వాటిని సరిచూసుకోవడం తదితర వ్యవహారాలతో రాత్రంతా ఎన్నికల సిబ్బంది, అధికారులు నిద్రపోకుండానే ఆయా పనులు చేపట్టారు. మొత్తానికి మంగళవారం ఉదయం ఆరు గంటలకు మొత్తం ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి స్వీకరణ పూర్తయింది. ఎన్నికల సిబ్బంది ఆదివారం రాత్రి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని సోమవారం రోజంతా పోలింగ్ నిర్వహించి, పోలింగ్ అనంతరం ఈవీఎంలు, సామగ్రిని అప్పగింతకు రాత్రంతా పాడేరులో జాగరం చేశారు. ఈ మొత్తం ప్రక్రియలో పోలింగ్ సిబ్బంది జిల్లాలో ఎన్నికలను విజయవంతం చేసినందుకు గానూ సిబ్బందిని అధికారులు అభినందించారు.
ఎన్నికల పరిశీలకుడి సమక్షంలో స్ర్టాంగ్‌రూమ్‌లకు ఈవీఎంలు
పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్‌లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు చెందిన ఈవీఎంలను ఎన్నికల పరిశీలకుడు కె.వివేకానందన్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.విజయసునీత, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వేర్వేరు స్ట్రాంగ్‌రూమ్‌ల్లో భద్రపరిచారు. అరకులోయ ఎంపీ స్థానం ఈవీఎంల స్ర్టాంగ్‌రూమ్‌కు జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత, పాడేరు అసెంబ్లీ స్ట్రాంగ్‌రూమ్‌కు ఆర్వో భావన వశిష్ఠ, అరకులోయ అసెంబ్లీ స్ట్రాంగ్‌రూమ్‌కు ఆర్వో అభిషేక్ సీలు వేశారు. ఈ మొత్తం ప్రక్రియను జిల్లా ఎన్నికల పరిశీలకుడు వివేకానందన్ పరిశీలిస్తుండగా, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - May 15 , 2024 | 01:05 AM