ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉక్కు సీఎండీపై ఊగిసలాట

ABN, Publish Date - Dec 03 , 2024 | 01:12 AM

స్టీల్‌ప్లాంటు విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన, అనుమానం రేకెత్తిస్తున్నాయి.

  • సీఎండీ అతుల్‌ భట్‌ను రెండు నెలల క్రితం సెలవుపై పంపిన కేంద్రం

  • ప్లాంటులో ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌గా ఉన్న అరుణ్‌ కంటి బాగ్చికి అదనపు బాధ్యతలు అప్పగింత

  • 20 రోజులకే ఆయన్ను తొలగించి సక్సేనా నియామకం

  • ఇప్పుడు పూర్తిస్థాయి సీఎండీ పదవీ విరమణ చేసినా గతంలో ఎంపిక చేసిన శక్తిమణికి

  • అందని ఉత్తర్వులు

    విశాఖపట్నం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటు విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన, అనుమానం రేకెత్తిస్తున్నాయి. సీఎండీలను ఇష్టం వచ్చినట్టు మార్చడమే దీనికి కారణం.

సెప్టెంబరు మొదటి వారం వరకూ సీఎండీగా పనిచేసిన అతుల్‌భట్‌ను ఉక్కు మంత్రిత్వ శాఖ ఆకస్మికంగా సెలవుపై పంపించేసింది. ఇక్కడే ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌గా ఉన్న అరుణ్‌ కంటి బాగ్చికి సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కొత్త సీఎండీ వచ్చేంత వరకూ బాధ్యతలు నిర్వహించాలని సూచించారు. వాస్తవానికి అతుల్‌భట్‌ నవంబరు 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. రెండున్నరేళ్లు ఆయన్ను కొనసాగించిన వారికి ఇంకో రెండు నెలలు ఉంచడం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ఎందుకో తప్పించారు. ఈ పోస్టు కోసం పద్ధతి ప్రకారం మూడు నెలల ముందే ప్రకటన జారీచేసి, దరఖాస్తులు స్వీకరించి ‘ది ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌’లో ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శక్తిమణిని ఆర్‌ఐఎన్‌ఎల్‌ సీఎండీగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సెప్టెంబరు మూడో తేదీన ప్రకటించారు. అతుల్‌భట్‌ను సెలవుపై పంపినప్పుడు శక్తిమణికి అవకాశం ఇవ్వాలి. కానీ అలా చేయకుండా ప్రాజెక్టు డైరెక్టర్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఇరవై రోజులు కాగానే ఆయన్ను కూడా తప్పించారు. సెప్టెంబరు 30న మాంగనీస్‌ ఓర్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంఓఐఎల్‌) సీఎండీ అజిత్‌కుమార్‌ సక్సేనాను తీసుకువచ్చి సీఎండీ సీట్లో కూర్చోబెట్టారు. ఆదివారం రోజున ఆయన నియామకపు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కొనసాగాలని సూచించారు. నిబంధనల ప్రకారం చూస్తే అధికారిక సీఎండీ అతుల్‌భట్‌ నవంబరు 30వ తేదీన పదవీ విరమణ చేసినందున కమిటీ ఎంపిక చేసిన శక్తిమణికి అవకాశం ఇవ్వాలి. కానీ ఆయనకు ఇంకా ఆదేశాలు ఇవ్వలేదు. ఇంకొన్నాళ్లు సక్సేనానే కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం. సక్సేనా బాధ్యతలు చేపట్టాక బ్యాంకుల్లో నిధులు ఉన్నా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. సెప్టెంబరు జీతం 50 శాతం, అక్టోబరు నెల 35 శాతం జీతం బకాయిలు పెట్టారు. నవంబరు నెల జీతాలకు సంబంధించి 9వ తేదీ వరకు ఎటువంటి ప్రతిపాదనలు తయారు చేయవద్దని ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. అంటే పదో తేదీ వరకూ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. జీతాల కోసం ఉద్యోగులు ఫైనాన్స్‌ డైరెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తే వారందరిని గుర్తించి నోటీసులు జారీచేశారు. మరోసారి ధర్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాంతో ఉద్యోగుల కుటుంబ సభ్యులను రోడ్లపైకి వచ్చి జీతాల కోసం ఆందోళన చేస్తున్నారు. ఏం చేసినా వారికి సకాలంలో జీతాలు ఇవ్వడానికి సీఎండీ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఇక్కడి పరిస్థితిని విశాఖ ఎంపీ శ్రీభరత్‌ స్వయంగా కేంద్ర ఉక్కు శాఖా మంత్రి కుమారస్వామి దృష్టికి తీసుకువెళ్లినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకపోవడం గమనార్హం.

Updated Date - Dec 03 , 2024 | 01:12 AM