ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Swaroopanandendra: అద్భుతమైన ముహూర్తంలో చంద్రబాబు ప్రమాణం!

ABN, Publish Date - Jun 10 , 2024 | 11:50 AM

విశాఖ: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా.. ఎవరు తమ వద్దకు వచ్చినా.. తాము ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతామని, దూరమైనా పరవాలేదని, సంపాదించుకోవాలి, దాచుకోవాలనేది కాదని విశాఖ శారద పీఠం స్వరూపానందేంద్రస్వామి అన్నారు. సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి (Swarupanandendra Swamy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా.. ఎవరు తమ వద్దకు వచ్చినా.. మేం ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాం.. దూరమైనా పరవాలేదు కానీ.. సంపాదించుకోవాలి, దాచుకోవాలనేది కానే కాదు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల అధినేత (ABN Andhra Jyothi Organisations Head) వేమూరి రాధాకృష్ణ (Vemuri Radha Krishna)తో తనకు చాలా అనుబంధం ఉంది. నేను ఎలా ఉంటానే ఆయనకు బాగా తెలుసు. ఈ ఐదేళ్లలో పీఠం ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉంది. ఇప్పుడు చంద్రబాబు (Chandrababu)ను కొత్తగా నేను పొగుడుతున్నానని అనుకోవద్దు. అప్పుడు (2014) సీఎం అయినప్పుడు కూడా రాజమండ్రి (Rajahmundry)లో సభలు పెట్టి.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉంది’ అని స్వరూపానందేంద్రస్వామి చెప్పుకొచ్చారు.


ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిందని, దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, మోదీ ప్రమాణ స్వీకారం చేయటం తమకు హిందూ ధర్మ పరిరక్షకులుగా మాకు ఆనందదాయకమని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. తాను శ్రీకాకుళం జిల్లా వాసినని, ఆ జిల్లాకు చెందిన రామ్మోహన్ నాయుడుకు కేంద్ర క్యాబినెట్లో స్థానం దక్కను హర్షణీయమన్నారు. ఇంతటి అవకాశానికి కారణం చంద్రబాబు అని, చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్నది అద్భుతమైన ముహూర్తం సింహ లగ్నమని, ప్రజలకు నచ్చే విధంగా పరిపాలన చేయాలని ఆశీర్వదిస్తున్నానని అన్నారు. ప్రమాణ స్వీకారం రోజున ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుతూ మేము కూడా యాగాలు చేస్తున్నామన్నారు. ఏ ప్రభుత్వం వచ్చిన ప్రజలు బాగుండాలనేది తమ ఆకాంక్ష అని, చంద్రబాబు పరిపాలన అనుభవం కలిగిన వ్యక్తి అని, కేంద్రంలో మంచి సంబంధాలు కలిగి ఉన్నారని ఆయన అన్నారు.


అమరావతి రాజధానిలో మేము కూడా ఒక స్థలాన్ని కొనుగోలు చేశామని, అమరావతిలోని శారదాపీఠం నిర్మాణం చేయాలని ఎప్పుడో నిర్ణయించామని, త్వరలోనే మంచి ముహూర్తం చూసి ప్రారంభిస్తామని స్వరూపానందేంద్ర తెలిపారు. రిషికేశ్, చాతుర్మాస దీక్షకు వెళ్తున్నామని, 30 సంవత్సరాలలో ఏ రోజు పరిపాలన విషయాల్లో జోక్యం చేసుకోలేదని, ప్రతి విషయం, ఉన్నది ఉన్నట్లు తెలిసింది తెలిసినట్లు చెబుతానన్నారు. శ్రీశైలం కుంభాభిషేకం చేయొద్దని చెప్పానని, కోర్టుకు వెళ్లి చేశారన్నారు. టీటీడీ విషయంలో సింహాచల విషయం ఉన్నది ఉన్నట్లు మాట్లాడానని, గతంలో కూడా చంద్రబాబు గెలుపుకు తాను కూడా పూజలు చేశానన్నారు. ఎవ్వరితో తమకు విభేదాలు ఉండవని, ధర్మం కోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు.


ఈరోజు మీడియా సమావేశం పెట్టింది ఎవరికో భయపడి కాదని.. గతంలో పీఠం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుందని, చంద్ర బాబు అంటే తనకు చాలా గౌరవం అని స్వరూపానందేంద్ర అన్నారు. రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండాలని మనస్పూర్తిగా ఆశీర్వదిస్తున్నానని అన్నారు. పీఠం ఎదిగింది రాజకీయ నాయకుల వల్ల కాదని.. భక్తులు వల్లని... ఈ పీఠానికి ఎంతో మంది ప్రముఖులు వచ్చారని స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హీరోలుగా ఉన్న ఆ నేతలు ఇప్పుడు జీరోలు..

కేబినెట్‌ బెర్త్‌లపై ఆ ఎమ్మెల్యేల ఆశలు..

ఆ జిల్లాలో వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..

12న తిరుమలకు రానున్న చంద్రబాబు..

బరిలోకి బాబు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Read more!

Updated Date - Jun 10 , 2024 | 12:46 PM

Advertising
Advertising