ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అన్నదాత వర్రీ

ABN, Publish Date - Nov 13 , 2024 | 11:27 PM

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు అనుకూలించడంతో జిల్లాలో వరి పంట ఆశాజనకంగా పడింది.

పాడేరు మండలం డి.గొందూరు ప్రాంతంలో వరి యంత్రంతో వరి నూర్పులు

అల్పపీడన ప్రభావంతో హడావిడిగా కోతలు, నూర్పులు

పంటను కాపాడుకునే పనిలో నిమగ్నం

పాడేరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు అనుకూలించడంతో జిల్లాలో వరి పంట ఆశాజనకంగా పడింది. మరో రెండు, మూడు వారాల్లో దాదాపుగా కోతలు సైతం పూర్తయ్యే పరిస్థితి. ఈ తరుణంలో తాజాగా అల్పపీడనం ఏర్పడి రాత్రి వేళల్లో వర్షాలు కురుస్తుండడంతో చేతికి వచ్చే పంట ఏమౌతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే మంగళవారం రాత్రి సైతం జల్లులతో కూడిన వర్షం కురవడంతో ముందు జాగ్రత్త చర్యగా కోసిన వరి పంటలను యంత్రాలతో నూర్పించే పనిలో కొందరు రైతులు నిమగ్నంకాగా, కోసిన వరి పనలను కుప్పలు వేసే పనిలో మరికొంతమంది రైతులున్నారు. అయితే ఇప్పటికే అనేక చోట్ల కోసిన వరి పనలు పంటపొలాల్లోనే ఉన్నాయి. దీంతో తాజా ప్రతికూల వాతావరణంలో ఎటువంటి నష్టం వాటిల్లుతుందోనని రైతులు భయపడుతున్నారు. పంట బాగా పండి చేతికి వచ్చే ఈ సమయంలో భారీ వర్షాలు కురిస్తే వరి పంట నాశనమయ్యే ప్రమాదముందని రైతులు అంటున్నారు. ఈ క్రమంలో తమ పంటను కాపాడుకునే హడావిడిలో అన్నదాతలు ఉన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 11:27 PM