ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పూడిమడక హార్బర్‌ పనులను పరిశీలించిన కలెక్టర్‌

ABN, Publish Date - Nov 19 , 2024 | 11:23 PM

పూడిమడక హార్బర్‌ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మంగళవారం పరిశీలించారు. తొలుత పూడిమడక - లోవపాలెం ప్రధాన రహదారి నుంచి హార్బర్‌ ప్రాంతం వరకు వేసిన రోడ్డుతోపాటు తీరంలో నిర్మాణంలో వున్న అంతర్గత రోడ్ల నిర్మాణ పనులను ఆమె సందర్శించారు.

హార్బర్‌ ప్లాన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అచ్యుతాపురం నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): పూడిమడక హార్బర్‌ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మంగళవారం పరిశీలించారు. తొలుత పూడిమడక - లోవపాలెం ప్రధాన రహదారి నుంచి హార్బర్‌ ప్రాంతం వరకు వేసిన రోడ్డుతోపాటు తీరంలో నిర్మాణంలో వున్న అంతర్గత రోడ్ల నిర్మాణ పనులను ఆమె సందర్శించారు. హర్బర్‌ ప్లానింగ్‌ నమూనాను స్థానిక అధికారులు ఆమెకు చూపి వివరాలు తెలిపారు. ఈ నెల 29వ తేదీన పూడిమడక సమీపంలో ఎన్‌టీసీపీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. దీనికి సమీపంలో వున్న పూడిమడక హార్బర్‌ నిర్మాణ పనులను సీఎం, అధికారులు పరిశీలించే అవకాశం వుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ హార్బర్‌ నిర్మాణ పనులను పరిశీలించినట్టు తెలిసింది.

Updated Date - Nov 19 , 2024 | 11:23 PM