ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పొగాకు రైతు పంట పండింది

ABN, Publish Date - Jun 12 , 2024 | 12:53 AM

దిగుబడులతో పాటు ధర కూడా ఆశాజనకంగా ఉండడంతో బర్లీ పొగాకు రైతులు ఆనందంగా ఉన్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు పెరిగాయి. ఇదే తరుణంలో ధర కూడా ఐటీసీ గత సంవత్సరం కంటే కిలోకు రూ.35 మేర పెంచింది. మండలంలో కంఠారం, బాలారం, బకులూరు, కొమ్మిక తదితర పంచాయతీల్లో సుమారు ఐదు వందల ఎకరాల్లో ఈ సంవత్సరంబర్లీ పొగాకు సాగు చేశారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పనకు కంపెనీలు ముందుకు రాకపోవడంతో సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గుతూ వస్తోంది.

కంఠారం లో ఐటీసీ ఆద్వర్యంలో కొనుగోలుకు సిద్దంచేసిన బర్లీ పొగాకు బేళ్లు

వాతావరణం అనుకూలించడంతో ఆశాజనకంగా దిగుబడి

ధర కూడా పెంపు

కిలోకు రూ.35

కొయ్యూరు, జూన్‌ 11:

దిగుబడులతో పాటు ధర కూడా ఆశాజనకంగా ఉండడంతో బర్లీ పొగాకు రైతులు ఆనందంగా ఉన్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు పెరిగాయి. ఇదే తరుణంలో ధర కూడా ఐటీసీ గత సంవత్సరం కంటే కిలోకు రూ.35 మేర పెంచింది. మండలంలో కంఠారం, బాలారం, బకులూరు, కొమ్మిక తదితర పంచాయతీల్లో సుమారు ఐదు వందల ఎకరాల్లో ఈ సంవత్సరంబర్లీ పొగాకు సాగు చేశారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పనకు కంపెనీలు ముందుకు రాకపోవడంతో సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. కంఠారం, బాలారం, కొమ్మికతో పాటు మరో రెండు పంచాయతీల్లో మాత్రమే కొందరు రైతులు ఈ సంవత్సరం బర్లీ పొగాకు వేశారు. వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు బాగున్నాయి. ఒక్క కంఠారంలో ఐటీసీ ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో ఇప్పటివరకూ 350 టన్నుల మేర బర్లీ పొగాకును రైతులు విక్రయించారు. రైతుల వద్ద మరో 50 నుంచి 100 టన్నుల పొగాకు ఉండవచ్చునంటున్నారు. గత సంవత్సరం ఇదే కొనుగోలు కేంద్రం పరిధిలో 150 టన్నులకు మించి దిగుబడి రాలేదు. అలాగే గత సంవత్సరం ఐటీసీ కంపెనీ కిలో బర్లీ పొగాకు రూ.115కు కొనుగోలు చేసింది. ధర పెంచాలని రైతులు ఏటా మొర పెట్టుకున్నా ఎప్పుడూ కిలోకు రూ.5 మించి పెంచిన సందర్భాలు లేవు. అటువంటిది ఈ సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్‌లో బర్లీ పొగాకు నిల్వలు లేకపోవడంతో రైతు అడగక పోయినా ధరను కిలోకు రూ.35 మేర పెంచింది.

గడిచిన దశాబ్దకాలంగా బర్లీ పొగాకు రైతులకు పెట్టుబడి రావడం తప్పితే ఏనాడూ ఒక రూపాయి మిగిలింది లేదు. అందుకు భిన్నంగా ఈ సంవత్సరం లాభాలు రావడంతో రైతు ముఖాలలో ఆనందం కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఐటీసీ ప్రతినిధులు మాట్లాడుతూ ఇప్పటివరకూ జిల్లాలో 700 టన్నుల మేర కొనుగోలు చేశామన్నారు. మరో 300 టన్నులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుందన్నారు. గత సంవత్సరం 547 టన్నులు కొనుగోలు చేయగా, ఈ సంవత్సరం దానికి రెట్టింపు కొనుగోలు చేయనున్నట్టు చెప్పారు.

Updated Date - Jun 12 , 2024 | 12:53 AM

Advertising
Advertising