Visakhapatnam: తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..
ABN, Publish Date - Feb 04 , 2024 | 09:35 AM
విశాఖలో పెను సంచలనంగా మారిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కన్వీనియన్స్ డీడ్ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
విశాఖలో పెను సంచలనంగా మారిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కన్వీనియన్స్ డీడ్ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు సుబ్రహ్మణ్యం గంగారoగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఐటీ హిల్స్ సమీపంలో ఉన్న జ్యూయల్ అపార్ట్మెంట్ కు సంబంధించిన, ప్లాట్ వ్యవహారమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో నిందితుని కోసం పోలీసులు బృందాలుగా గాలింపు చేపడుతున్నారు.
కాగా.. బెదిరింపులు, కిడ్నాప్ లతో ఇప్పటికే వణికిపోతున్న విశాఖవాసులను ఈ హత్యాకాండ నివ్వెరపరిచింది. రాజధానిగా ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసుకుంటున్న విశాఖలో ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఆయన ఇంటి వద్దే హతమార్చిన తీరు సర్వత్రా భయభ్రాంతులకు గురిచేసింది. భద్రత విషయంలో జనం, వ్యాపారులు భయపడే పరిస్థితిని కల్పించింది. ఐదేళ్ల క్రితం వరకు విశాఖ ప్రశాంత నగరం. కానీ ఇప్పుడు కల్లోల నగరంగా మారడం గమనార్హం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 04 , 2024 | 09:36 AM