ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మెట్రో ప్రాజెక్టుపై వాడీవేడిగా..

ABN, Publish Date - Nov 14 , 2024 | 01:10 AM

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుపై అసెంబ్లీలో కూటమి నాయకుల మధ్యే బుధవారం వాడివేడి చర్చ జరిగింది. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు ఏ దశలో ఉంది?, ఎలా నిర్మించబోతున్నారంటూ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు ప్రశ్న వేశారు. దానికి పురపాలక శాఖ ఇచ్చిన సమాచారం చూసి ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. వైసీపీ ప్రభుత్వం తయారుచేసిన నివేదికలు ఇచ్చారని, ఈ నెల మూడో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నం కలెక్టర్‌ కార్యాలయంలో సమీక్షం నిర్వహించి, మెట్రో రైలు ప్రాజెక్టును డబుల్‌ డెక్కర్‌ మోడల్‌లో నిర్మించాలని అధికారులకు సూచించారని, ఆ విషయాలు ఏవీ తనకు ఇచ్చిన సమాధానంలో లేవని ఆరోపించారు.

ఎలా నిర్మించబోతున్నారని అసెంబ్లీలో ఎమ్మెల్యే వెలగపూడి ప్రశ్న

వైసీపీ ప్రభుత్వ హయాంలో రూపొందించిన

పాత ప్రతిపాదనలు ఇచ్చారని అంసతృప్తి

ఏ మోడల్‌లో నిర్మిస్తారో తెలియజేయాలని కోరిన ఎమ్మెల్యే గణబాబు

ఫ్లైఓవర్లు అవసరమన్న పల్లా శ్రీనివాసరావు

రెండు దశల్లో నాలుగు కారిడార్లు నిర్మిస్తామని మంత్రి నారాయణ

కేంద్రం నుంచి అనుమతి రాగానే ముందుకు వెళతామని వెల్లడి

విశాఖపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుపై అసెంబ్లీలో కూటమి నాయకుల మధ్యే బుధవారం వాడివేడి చర్చ జరిగింది. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు ఏ దశలో ఉంది?, ఎలా నిర్మించబోతున్నారంటూ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు ప్రశ్న వేశారు. దానికి పురపాలక శాఖ ఇచ్చిన సమాచారం చూసి ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. వైసీపీ ప్రభుత్వం తయారుచేసిన నివేదికలు ఇచ్చారని, ఈ నెల మూడో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నం కలెక్టర్‌ కార్యాలయంలో సమీక్షం నిర్వహించి, మెట్రో రైలు ప్రాజెక్టును డబుల్‌ డెక్కర్‌ మోడల్‌లో నిర్మించాలని అధికారులకు సూచించారని, ఆ విషయాలు ఏవీ తనకు ఇచ్చిన సమాధానంలో లేవని ఆరోపించారు. సీఎం చేసిన సూచనలు కూడా ప్రతిపాదనల్లో చేర్చలేదా?, కేంద్రానికి ఏ ప్రతిపాదనలు పంపారో మంత్రి నారాయణ వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ, రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించాలనే ప్రతిపాదన ఉందని, దాని ప్రకారమే గతంలో సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో దీనికి డీపీఆర్‌ రూపొందించారని గుర్తుచేశారు. టెండర్లు పిలిచి ఖరారు చేసే సమయంలో ఎన్నికలు రావడంతో అది అక్కడితో ఆగిపోయిందన్నారు. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మెట్రో కారిడార్‌ను పక్కన పెట్టిందన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టును పాత విధానం ప్రకారం 40 శాతం కేంద్రం ఇచ్చే వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌తో చేస్తారా?, లేదంటే కోల్‌కతా మోడల్‌లా పూర్తిగా 100 శాతం కేంద్రం సాయంతో నిర్మిస్తారా?...చెప్పాలని కోరారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే అక్కడకు నగరం నుంచి జాతీయ రహదారిపై వెళ్లడానికి చాలా సమయం పడుతుందని, ఫ్లైఓవర్ల నిర్మాణం అవసరం ఉందని, వాటిని ఈ ప్రాజెక్టులో కలిపి నిరిస్తారా?, విడిగా నిర్మిస్తారా?...వివరించాలని కోరారు.

కేంద్రం నుంచి అనుమతి రాగానే ముందుకు వెళతాం

పి.నారాయణ, పురపాలక శాఖ మంత్రి

ఈ అంశంపై పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. విశాఖ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర రవాణా ప్రణాళిక కేంద్రానికి సమర్పించామని, అనుమతి రాగానే ముందుకు వెళతామని చెప్పారు. గాజువాక నుంచి కొమ్మాది వరకు 42.5 కి.మీ. పొడవున మూడు కారిడార్ల నిర్మాణానికి డీపీఆర్‌ తయారుచేసి నాటి టీడీపీ ప్రభుత్వం కేంద్రానికి పంపిందన్నారు. టెండర్లు పిలవగా కొన్ని కంపెనీలు బిడ్లు కూడా వేశాయన్నారు. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం టెండర్లు రద్దు చేసి కారిడార్‌ను భోగాపురం విమానాశ్రయం వరకూ పొడిగించిందని, దాంతో కేంద్రం దానిని పక్కన పెట్టేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆ తరువాత ముందుకు వెళ్లలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కోల్‌కతా మెట్రో రైలు తరహాలో వంద శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేలా, రైల్వే శాఖకు ప్రాజెక్టు అప్పగించేలా ప్రతిపాదనలు కేంద్రానికి పంపించామన్నారు. రెండు దశల్లో నాలుగు కారిడార్లు నిర్మిస్తామన్నారు.

మొదటి దశలో 46.23 కి.మీ. పొడవున మూడు కారిడార్లు వస్తాయన్నారు. మొదటి కారిడార్‌ స్టీల్‌ ప్లాంటు నుంచి కొమ్మాది వరకూ 34.4. కి.మీ., రెండో కారిడార్‌ గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకు 5.07 కి.మీ., మూడో కారిడార్‌ తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కి.మీ. ఉంటుందన్నారు. దీనికి రూ.11,498 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 30.67 కి.మీ., 12 స్టేషన్లతో మెట్రో నిర్మాణానికి ప్రతిపాదన చేశామన్నారు. మెట్రో కారిడార్‌ వెళ్లే మార్గంలో ఎక్కువ క్రాసింగ్స్‌ ఉన్నందున ప్రతి క్రాసింగ్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా కార్‌షెడ్డు, ఎండాడ, హనుమంతవాక, మద్దిలపాలెం, విప్రో, గురుద్వారా, అక్కయ్యపాలెం, తాటిచెట్లపాలెం, గాజువాక, స్టీల్‌ప్లాంటు జంక్షన్ల వద్ద టూ లెవెల్‌ మెట్రో, ఫ్లైఓవర్లు నిర్మించాలని ప్రతిపాదించినట్టు వివరించారు.

Updated Date - Nov 14 , 2024 | 01:11 AM