ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు ముగ్గురు ఎంపిక

ABN, Publish Date - Nov 18 , 2024 | 11:50 PM

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.విజయ భారతి తెలిపారు.

జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు ఎంపికైన విద్యార్థులతో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విజయ భారతి, అధ్యాపకులు

చింతపల్లి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.విజయ భారతి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఊరేగించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ విలేకరులతో మాట్లాడుతూ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ రెండో సంవత్సరం విద్యార్థి చదల మహేశ్‌ 63 కేజీల విభాగంలో, బీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థులు పాంగి రమేశ్‌ 61 కిలోలు, వంతల రమేశ్‌ 57 కిలోల విభాగాల్లో అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం డిగ్రీ కళాశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎనిమిదో బాలుర, బాలికల రెజ్లింగ్‌ పోటీల్లో పాల్గొన్నారన్నారు. చదల మహేశ్‌ స్వర్ణం, పాంగి రమేశ్‌ రజితం, వంతల రమేశ్‌ స్వర్ణం మెడల్స్‌ సాధించారన్నారు. ఈ ముగ్గురు విద్యార్థులు డిసెంబరు 4, 5 తేదీల్లో బెంగళూరులో జరిగే జాతీయ పోటీలకు పాల్గొనేందుకు అర్హత సాధించారన్నారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థులు, పీడీ కె. శివరామ్‌కృష్ణ, కోచ్‌ అంబటి నూకరాజును ఆయన అభినందించారు.

Updated Date - Nov 18 , 2024 | 11:50 PM