ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విప్‌లుగా ఇద్దరు

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:51 AM

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన ఇద్దరికి ప్రభుత్వంలో కీలక పదవులు లభించాయి.

ఎమ్మెల్యే పి.గణబాబు, ఎమ్మెల్సీ చిరంజీవిరావుకు అవకాశం

విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన ఇద్దరికి ప్రభుత్వంలో కీలక పదవులు లభించాయి. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పీవీజీఆర్‌ నాయుడు (గణబాబు), ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావులను ‘విప్‌’లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరిరువురూ పార్టీ సభ్యులను సమన్వయం చేసుకుంటూ శాసనసభ/మండలి సమావేశాలు సజావుగా సాగేలా చూడాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా అంశంపై ఓటింగ్‌ ఉన్నప్పుడు తమకు కేటాయించిన సభ్యులు సభకు వచ్చేలా, కీలకమైన చర్చల్లో పాల్గొనేలా చూడాలి. గణబాబు 2014-2019 మధ్య కూడా విప్‌గా ఉన్నారు. చిరంజీవిరావు 2023 ఉత్తరాంధ్ర పట్టభద్ర నియోజకవర్గం నుంచి శాసన మండలికి ఎన్నికయ్యారు. తమకు విప్‌గా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు గణబాబు, చిరంజీవిరావులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ ప్రయోజనాలు

విప్‌లకు సహాయ మంత్రి హోదా లభిస్తుంది. ప్రభుత్వం ఎర్ర బుగ్గ లైటుతో అధికారిక వాహనం సమకూరుస్తుంది. అలాగే ఆఫీసు, నిర్వహణకు సిబ్బందిని అందిస్తుంది. సభలో తీర్మానాలు ప్రవేశపెట్టడానికి, చర్చ లేవదీయడానికి, సవరణలు ప్రతిపాదించడానికి అవకాశం లభిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం, పత్రాలు చూడడానికి అధికారం ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించినప్పుడు తగిన ప్రాధాన్యం లభిస్తుంది. కీలక సమావేశాలు నిర్వహించినప్పుడు ఆహ్వానం ఉంటుంది.

Updated Date - Nov 13 , 2024 | 12:51 AM