ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెండు ఆటోలు ఢీ

ABN, Publish Date - Oct 31 , 2024 | 12:33 AM

మండలంలోని చింతలపూడి వద్ద బుధవారం మధ్యాహ్నం ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొనడంతో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

చింతలపూడి వద్ద ప్రమాదానికి గురైన ఆటోలు

పది మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం

చింతలపూడి వద్ద ప్రమాదం

కొయ్యూరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని చింతలపూడి వద్ద బుధవారం మధ్యాహ్నం ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొనడంతో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. డౌనూరు పంచాయతీ రొబ్బసింగి నుంచి కాకరపాడు గురుకుల కళాశాలలో చదువుతున్న తమ పిల్లలను చూసుకునేందుకు నలుగురు ఆటోలో బయలుదేరారు. కొయ్యూరు నుంచి కృష్ణాదేవిపేటకు ప్రయాణికులతో మరో ఆటో వెళుతోంది. ఈ రెండు ఆటోలు చింతలపూడి వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. రొబ్బసింగి నుంచి వెళుతున్న ఆటో డ్రైవర్‌ పరిమితికి మించిన వేగంతో రాంగ్‌ రూట్‌లో వెళ్లి కొయ్యూరు నుంచి వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాద తీవ్రతకు రొబ్బసింగి నుంచి వస్తున్న ఆటో రెండు పల్టీలు కొట్టగా, కొయ్యూరు నుంచి వస్తున్న ఆటో తిరగబడి నుజ్జయ్యింది. ఈ ఘటనలో రొబ్బసింగికు చెందిన ఆటో డ్రైవర్‌ పాగి బాబూరావు, పాగి రత్నకుమారి, పాగి మృదుల అనే బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే కొయ్యూరు నుంచి వస్తున్న ఆటోలో ప్రయాణిస్తున్న రాయవరపు లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ రెండు ఆటోల్లో ప్రయాణిస్తున్న పిడతమామిడికి చెందిన భవాని, చాపరాతిపాలేనికి చెందిన గడుతూరి బుజ్జిబాబు, లక్ష్మీ పార్వతి, రొబ్బసింగికు చెందిన పాగి సన్యాసిరావు, రాజేంద్రపాలేనికి చెందిన అనిశెట్టి వెంకటపద్మ, చాపరాతిపాలేనికి చెందిన గడుతూరి బాబూరావులకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కొయ్యూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 31 , 2024 | 12:33 AM