ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సింహాద్రి ఎన్టీపీసీ కాలుష్యంతో పలు రకాల సమస్యలు

ABN, Publish Date - Apr 17 , 2024 | 01:16 AM

సింహాద్రి ఎన్టీపీసీ కాలుష్యం బారిన పడిన తమ గ్రామాన్ని తరలించాలని మూలస్వయంభూవరం ప్రజలు మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.

నినాదాలు చేస్తున్న గ్రామస్థులు

మూలస్వయంభూవరం గ్రామాన్ని తరలించాల్సిందే

పరవాడ, ఏప్రిల్‌ 16: సింహాద్రి ఎన్టీపీసీ కాలుష్యం బారిన పడిన తమ గ్రామాన్ని తరలించాలని మూలస్వయంభూవరం ప్రజలు మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఎన్టీపీసీ నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి కారణంగా రోగాలబారిన పడుతున్నామన్నారు. నీటి వనరులు కలుషితమయ్యాయని, తాగునీటిని కొనుక్కోవాల్సి వస్తున్నదని, పంటలు పాడేపోతున్నాయని, పశువులు మృత్యువాత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు ఉపిరితిత్తులు, మూత్రపిండాలు, నేత్ర సంబంధ సమస్యలతో బాధపడుతున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి బాబురావు, భానుప్రసాద్‌, కె.లక్ష్మి, అప్పలనాయుడు, గనిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Updated Date - Apr 17 , 2024 | 01:16 AM

Advertising
Advertising