ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, Publish Date - Aug 26 , 2024 | 02:46 PM

కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణీ విమర్శల దాడి చేశారు. ఎసెన్షియా ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు.

Varudu Kalyani

విశాఖపట్నం: ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణీ విమర్శల దాడి చేశారు. ఎసెన్షియా ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు. మదనపల్లిలో పేపర్లు తగలబడితే హెలికాప్టర్ పంపారని, ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాలు కోసం ఒక హెలికాప్టర్ పంపలేరా అని ఆమె అన్నారు. పేపర్లకు ఉన్న విలువ కార్మికుల ప్రాణాలకు లేవా అని ప్రశ్నించారు.


వైఎస్ జగన్‌పై విమర్శల చేయడానికి హోమ్ మినిస్టర్ అనిత అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అనిత భాష చూసి ప్రజలు సిగ్గు పడుతున్నారని అన్నారు. ‘‘అనిత సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు. నితా ఒక అసమర్థ హోం మినిస్టర్. వైఎస్ జగన్‌పై విమర్శలు పక్కన పెట్టి ఫార్మా ప్రమాదాల నివారణపై దృష్టి పెడితే బాగుంటుంది. అనితకు సన్మాల మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలు మీద లేదు. ఎల్జీ పాలిమర్ ప్రమాద సమయంలో వైఎస్ జగన్ పరామర్శకు రాలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అనిత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు’’ అని వరుదు కళ్యాణి పేర్కొన్నారు.


సెనర్జీస్ ఫార్మా ప్రమాద బాధితులకు పరిహారం అందజేత..

పరవాడ సెనర్జీస్ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపుపై ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హోమంత్రి అనిత ఇవాళ (సోమవారం) రంగంలోకి దిగారు. ఎసెన్షియ ఫార్మాలో ప్రమాద మృతులకు ఏవిధంగా చెల్లించారో అదే మాదిరిగా పరవాడ సెనర్జీస్ మృతుల కుటుంబాలకు కూడా పరిహారం చెల్లించాలని యాజమాన్యంతో ఆమె చర్చించారు. దీంతో బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం చెల్లింపునకు పరవాడ సెనర్జీస్ ఫార్మా అంగీకారం తెలిపింది. పరిహారానికి సంబంధించిన చెక్కులను ఆసుపత్రిలో మృతుల కుటుంబాలకు సెనర్జీస్ యాజమాన్యం అందజేసింది.

Updated Date - Aug 26 , 2024 | 03:58 PM

Advertising
Advertising
<