బాద్రపద మాసంలో అప్పన్న సన్నిధిలో వైదిక ఉత్సవాలు
ABN, Publish Date - Sep 05 , 2024 | 12:05 AM
వరాహలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో బాద్రపద మాసంలో పలు వైదిక ఉత్సవాలు నిర్వహించనున్నట్టు దేవస్థానం అధికారులు తెలి పారు. బుధవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు.
సింహాచలం, సెప్టెంబరు 4 : వరాహలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో బాద్రపద మాసంలో పలు వైదిక ఉత్సవాలు నిర్వహించనున్నట్టు దేవస్థానం అధికారులు తెలి పారు. బుధవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 5న స్వర్ణ పుషాపర్చన, 6న తాయారు సన్నిధిలో సహస్రనామ కుంకుమార్చన, సాయంత్రం బేడా తిరువీధి, 8న స్వాతి నక్షత్ర హవనం, 9న శ్రీనమ్మాళ్వార్ తిరు నక్షత్ర పూజలు, 12న మనవాళ మహామునుల మాస తిరు నక్షత్ర పూజలు, 13న ఉదయం తయార్ సన్నిధిలో సహస్రనామ కుంకుమార్చన, స్వామివారి పవిత్రోత్సవాలు పురస్కరించుకుని సాయంత్రం అంకురార్పణ జరగనుంది. అలాగే 14న ఏకాదశి పవిత్రాదివాసం, పవిత్ర పవిష్ట, గ్రామ తిరువీధి, 15 పవిత్ర సమర్పణ, గ్రామ తిరువీధి, కొండదిగువ వేంకటేశ్వరస్వామి దేవళంలో సుదర్శన హవనం, 16న పూర్ణాహుతి, పవిత్ర విసర్జనం, ఆరాధన, తిరువీధి, 17న నృసింహ మాస జయంతి, ఏకాంత స్నపన తిరుమంజనం, పవిత్రోత్సవాల సమాప్తి, సాయంత్రపు తిరువీధి, 18న బాద్రపద మాస పూర్ణిమ గ్రామ తిరువీధి, 19న స్వర్ణ పుష్పార్చన, మహాలయ పక్ష ప్రారంభం, 20న అమ్మవారి సన్నిధిలో శుక్రవార కుంకుమ పూజలు, బేడా తిరువీధి, 22న స్వర్ణపుష్పార్చన, 23న మాధవధార వేణుగోపాలస్వామి సన్నిధిలో అష్టాక్షరీ మంత్ర హవనం, 26న స్వర్ణ పుష్పార్చన, సింహగిరిపై సీతారామస్వామి ఆలయంలో సంక్షిప్త రామాయణం, షడక్షరీ మంత్ర హవనం, 27న అమ్మవారి సన్నిధిలో సహస్ర కుంకుమార్చన, సాయంత్రం బేడా తిరువీధి, 28న బాద్రపదమాస బహుళపక్ష ఏకాదశి స్వర్ణ తులసీ దళార్చన, గ్రామతిరువీధి, 29న స్వర్ణ పుష్పార్చన, ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Updated Date - Sep 05 , 2024 | 12:05 AM