ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వెలుగు సిబ్బందిపై వేటు?

ABN, Publish Date - Nov 15 , 2024 | 01:10 AM

మండలంలోని సింహాద్రిపురం పంచాయతీలో డ్వాక్రా సభ్యుల రుణాల సొమ్మును స్వాహా చేసిన వారిపై డీఆర్‌డీఏ (వెలుగు) అధికారులు విచారణను కొనసాగిస్తున్నారు. బుధవారం సింహాద్రిపురం, పాతిక గ్రామాల్లో విచారణ చేపట్టిన డీఆర్‌డీఎ అధికారులు గురువారం కూడా ఆయా గ్రామాల్లో డ్వాక్రా సంఘాల సభ్యులను విచారించారు. ఎంత మేర నిధులు పక్కదారి పట్టాయన్నదానిపై వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

చోడవరంలో వెలుగు కార్యాలయం

డ్వాక్రా సంఘాల నిధులు స్వాహా వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న డీఆర్‌డీఏ అధికారులు

రెండు రోజూ కొనసాగిన విచారణ

చోడవరం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సింహాద్రిపురం పంచాయతీలో డ్వాక్రా సభ్యుల రుణాల సొమ్మును స్వాహా చేసిన వారిపై డీఆర్‌డీఏ (వెలుగు) అధికారులు విచారణను కొనసాగిస్తున్నారు. బుధవారం సింహాద్రిపురం, పాతిక గ్రామాల్లో విచారణ చేపట్టిన డీఆర్‌డీఎ అధికారులు గురువారం కూడా ఆయా గ్రామాల్లో డ్వాక్రా సంఘాల సభ్యులను విచారించారు. ఎంత మేర నిధులు పక్కదారి పట్టాయన్నదానిపై వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

చోడవరం మండలం సింహాద్రిపురం పంచాయతీ వెలుగు వీవోఏ ఒకరు సింహాద్రిపురం, పాతిక గ్రామాలకు చెందిన డ్వాక్రా మహిళల పేరుతో సుమారు రూ.15 లక్షల రుణం మంజూరు చేయించి, ఆ సొమ్మును వేరే ఖాతాలకు మళ్లించుకున్నారు. ఇంకా పలు డ్వాక్రా సంఘాలు రుణ బకాయిల చెల్లింపు కోసం ఇచ్చిన డబ్బులను పక్కదారి పట్టించారు. ఈ విషయాన్ని ఒకింత ఆలస్యంగా గుర్తించిన సదరు డ్వాక్రా సంఘాల సభ్యులు.. సంబంధిత వీవోఏపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించి వెలుగు అధికారులు.. డీఆర్‌డీఏ ప్రాజెక్టు మేనేజర్‌ డైసీని విచారణ అధికారిగా నియమించారు. ఆమె బుధవారం ఇక్కడకు వచ్చి వివరాలు సేకరించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్టు చెప్పారు.

సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు

రుణాల సొమ్ము స్వాహా వ్యవహారంలో బాధ్యులైన సిబ్బందిపై డీ ఆర్‌డీఏ అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది. డ్వాక్రా సంఘాల నిధులు గోల్‌మాల్‌పై సంబంధిత సీసీ, ఆపై అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. డీఆర్‌డీఏ ప్రాజెక్టు మేనేజర్‌ ఇచ్చిన నివేదిక మేరకు వెలుగు సిబ్బందిపై ఒకటి, రెండు రోజుల్లో క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్నట్టు తెలిసింది. ఇదిలా వుండగా, రుణాల సొమ్ము స్వాహా చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతోపాటు తమ డబ్బులను తిరిగి ఇప్పించాలని ఆయా డ్వాక్రా సంఘాల సభ్యులు కోరుతున్నారు.

Updated Date - Nov 15 , 2024 | 01:10 AM