కొత్త సార్ ఎప్పుడొస్తారో?
ABN, Publish Date - Sep 05 , 2024 | 12:34 AM
స్థానిక సబ్‌కలెక్టర్‌గా 2022 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సౌర్యమన్ పటేల్‌ను నియమించి పది రోజులవుతున్నప్పటికీ ఆయన విధుల్లో చేరలేదు. దీంతో కొత్త సార్ ఎప్పుడొస్తారోనని రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఎదురు చూస్తున్నారు. అయితే ఆయన సబ్‌కలెక్టర్‌గా విధుల్లో చేరుతారా?, లేక మరెవరినైనా నియమిస్తారా? అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.
సబ్‌కలెక్టర్ రాకకు ఎదురుచూపులు
2022 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సౌర్యమన్ పటేల్ సబ్‌కలెక్టర్‌గా నియామకం
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి పది రోజులైనా విధుల్లో చేరని వైనం
రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీని నియమిస్తారని ప్రచారం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
స్థానిక సబ్‌కలెక్టర్‌గా 2022 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సౌర్యమన్ పటేల్‌ను నియమించి పది రోజులవుతున్నప్పటికీ ఆయన విధుల్లో చేరలేదు. దీంతో కొత్త సార్ ఎప్పుడొస్తారోనని రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఎదురు చూస్తున్నారు. అయితే ఆయన సబ్‌కలెక్టర్‌గా విధుల్లో చేరుతారా?, లేక మరెవరినైనా నియమిస్తారా? అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.
స్థానిక సబ్‌కలెక్టర్‌గా పని చేసిన పి.ధాత్రిరెడ్డి ఈ ఏడాది జూలైలో ఏలూరు జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. దీంతో అప్పటి నుంచి స్థానిక జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ్ ఇన్‌చార్జి సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా 2021 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన తెనాలి సబ్‌కలెక్టర్ ప్రఖార్‌జైన్‌ను స్థానిక సబ్‌కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 17న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆయన విధుల్లో చేరలేదు. దీంతో ఆయనను బాపట్ల జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ, శిక్షణ పూర్తి చేసుకున్న 2022 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సౌర్యమన్‌పటేల్‌ను స్థానిక సబ్‌కలెక్టర్‌గా నియమిస్తూ ఆగస్టు 25న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులు జారీ చేసి ఇప్పటికి పది రోజులు కావస్తున్నా సౌర్యమన్‌పటేల్ సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించలేదు. పైగా ఆయన ఇక్కడికి వస్తారా?, రారా? అనేదానిపైనా స్థానిక అధికారులకు ఎటువంటి సమాచారం లేదు. దీంతో ఆయన రాకపై అయోమయం నెలకొంది.
కల్పశ్రీని సబ్‌కలె క్టర్‌గా నియమిస్తారా?
ప్రస్తుతం రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా నియమితులైన 2022 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కల్పశ్రీని స్థానిక సబ్‌కలెక్టర్‌గా నియమిస్తారనే ప్రచారం సైతం జరుగుతున్నది. ఆమె స్థానిక జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ్ సతీమణి కావడంతో త్వరలో ఆమెను స్థానిక సబ్ కలెక్టర్‌గా నియమించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న కల్పశ్రీని తొలుత నర్సీపట్నం సబ్‌కలెక్టర్‌గా నియమిస్తూ ఆగస్టు 17న ఉత్తర్వులు జారీ చేశారు. తరువాత ఆమెను రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా నియమిస్తూ ఆగస్టు 25న ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాస్తవానికి అప్పట్లోనే(ఆగస్టు 17న) ఆమెను స్థానిక సబ్‌కలెక్టర్‌గా నియమిస్తే బాగుండేదని పలువురు అంటున్నారు.
Updated Date - Sep 05 , 2024 | 12:34 AM