CM Chandrababu: చంద్రబాబుకు ముద్దు పెట్టిన మహిళా అభిమాని.. సీఎం రియాక్షన్ చూడండి
ABN, Publish Date - Nov 02 , 2024 | 09:31 PM
సినీ, రాజకీయ రంగాల్లో తమ అభిమాన నటులు, నాయకులను కలుసుకోవాలని ఎంతోమంది ఆశిస్తారు. కానీ కొందరు మాత్రమే తమ ఆశలను నెరవేర్చుకోగలరు. నిజంగా తమ అభిమాన నేతను కలిస్తే.. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. మన అభిమాన నాయకుడు సీఎం అయితే..
తమ అభిమాన నాయకులు కనిపిస్తే చాలు ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అదే నాయకుడిని కలిసి ఫోటో దిగితే ఆ ఆనందమే వేరు. సినీ, రాజకీయ రంగాల్లో తమ అభిమాన నటులు, నాయకులను కలుసుకోవాలని ఎంతోమంది ఆశిస్తారు. కానీ కొందరు మాత్రమే తమ ఆశలను నెరవేర్చుకోగలరు. నిజంగా తమ అభిమాన నేతను కలిస్తే.. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. మన అభిమాన నాయకుడు సీఎం అయితే.. సాధారణంగా సీఎంకు సమీపంలోకి వెళ్లాలంటే సామాన్యుడికి సాధ్యమయ్యేపనికాదు. పూర్తి భద్రతా వలయంలో ఉండటంతో పాటు.. సెక్కూరిటీ రీజన్స్‌తో సీఎంను అతి సమీపంగా వెళ్లి కలిసే అవకాశం చాలా అరుదుగా వస్తుంటుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జడ్ ప్లస్ భద్రతలో ఉండే చంద్రబాబు దగ్గరకు వెళ్లడమంటే మామూలు విషయమా.. కానీ ఓ మహిళా అభిమాని మాత్రం ఎలాగైనా తమ అభిమాన నేత చంద్రబాబును కలవాలనుకుని సంకల్పించుకుంది. ఇంకేముంది అనకాపల్లి పర్యటనకు వచ్చిన చంద్రబాబును కలిసేందుకు చుట్టూ ఉన్న భద్రతా వలయాన్ని తప్పించుకుని వచ్చారు. ఆమె అభిమానాన్ని చూసి చంద్రబాబు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సీఎం భద్రతా సిబ్బంది మహిళను వారించే ప్రయత్నం చేసినా, చంద్రబాబు మాత్రం ఆ మహిళను దగ్గరకు తీసుకుని.. అప్యాయంగా పలకరించారు. తమ అభిమాన నేతకు పుష్ఫగుచ్చాన్ని అందించింది. అక్కడితే ఆగలేదు. రాకరాక చంద్రబాబును కలిసే అవకాశం రావడంతో.. తమ అభిమాన నేతపై ఎంత ప్రేమ ఉందో చూపించే ప్రయత్నం చేసింది. చంద్రబాబును పట్టుకుని ఆయనకు ముద్దు పెట్టే ప్రయత్నం చేసింది. సీఎం ఆమెను ఏమి అనకపోయినా.. భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని మహిళను భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు.
భద్రతా సిబ్బందిని దాటుకుని
ఓ మహిళ భద్రతా సిబ్బందిని నెట్టుకుని నేరుగా సీఎం దగ్గరకు వచ్చి ఆయనను కలవడంతో అసలు అక్కడ ఏం జరుగుతుందోనని భద్రతా సిబ్బంది కంగారు పడ్డారు. చివరకు ఆమె చంద్రబాబు అభిమాని అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబును కలిసిన మహిళా అభిమాని మాత్రం తాను జీవితంలో ఈరోజును ఎప్పటికీ మర్చిపోలేనని, టీవీల్లో తమ నాయకుడిని చూసేవాళ్లమని, జీవితంలో తమ అభిమాన నేతను నేరుగా చూస్తే చాలు అనుకున్నామని, కానీ ఇవాళ ఆయనను కలిసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది.
అనకాపల్లి పర్యటనలో..
ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు అనకాపల్లిలో జరిగిన సభలో పాల్గొన్నారు. అక్కడ ప్రసంగించిన తర్వాత అధికారులతో కలిసి వెళ్తుండగా ఓ మహిళా అభిమాని వచ్చి చంద్రబాబును కలిసి పుష్ఫగుచ్చం అందించారు. ఆ తర్వాత సీఎంతో ఫోటో దిగి.. ఒక్కసారిగా ఆయనకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Nov 02 , 2024 | 09:38 PM