ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP: భీమిలిలో సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల సభ...హాజరు కానున్న జగన్..

ABN, Publish Date - Jan 27 , 2024 | 06:55 AM

విశాఖ: నగరంలో జన జాగరణ సమితి ప్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. శనివారం భీమిలిలో వైసీపీ ఆధ్వర్యంలో సిద్ధం పేరుతో ఎన్నికల సభ జరగనుందది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతున్నారు.

విశాఖ: నగరంలో జన జాగరణ సమితి ప్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. శనివారం భీమిలిలో వైసీపీ ఆధ్వర్యంలో సిద్ధం పేరుతో ఎన్నికల సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతున్నారు. వైసీపీ సిద్దంకు... జన జాగరణ సమితి ఫ్లెక్సీలతో యుద్ధం.. నగరంలో పలు చోట్ల వైసీపీకు వ్యతిరేకంగా ఈ ప్లెక్సీలు వెలిసాయి. జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు తన ఇంటి గేటుకు కూడా ఫ్లెక్సీని కట్టి నిరసన తెలిపారు.

నేడు సీఎం జగన్‌ రాక

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విశాఖ రానున్నారు. మధ్యాహ్నం 2.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మూడు గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి 3.05 గంటలకు హెలీకాప్టర్‌లో భీమిలి నియోజకవర్గ పరిధిలోని తగరపువలస సమీపానున్న సంగివలస వెళతారు. 3.30 గంటల నుంచి ఐదు గంటల వరకూ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయ సభలో పాల్గొంటారు. తిరిగి 5.10 గంటలకు హెలీకాప్టర్‌లో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, 5.35 గంటలకు విజయవాడ బయలుదేరి వెళతారు.

కాగా వైసీపీ శనివారం భీమిలి నియోజకవర్గంలోని సంగివలస నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించే సభకు నియోజకవర్గానికి పది వేల మందిని తీసుకురావాలని ఎమ్మెల్యేలకు, సమన్వయకర్తలకు అధిష్టానం టార్గెట్లు పెట్టింది. ఇందుకోసం భారీగా ఆర్టీసీ బస్సులు తీసుకుంటోంది. విశాఖపట్నం రీజియన్‌లో మధురవాడ, వాల్తేరు, విశాఖపట్నం, మద్దిలపాలెం, సింహాచలం, గాజువాక, స్టీల్‌ సిటీ డిపోలు ఉండగా మొత్తం 804 బస్సులు సిటీతో పాటు వివిధ రూట్లలో నడుస్తున్నాయి. వాటిలో 325 బస్సులను శనివారం సంగివలస సభ కోసం తీసుకున్నారు. అంటే సుమారు సగం బస్సులు శనివారం ప్రజలకు అందుబాటులో ఉండవు.

ప్రైవేటు బస్సులు కూడా...

సంగివలస సభకు జనాన్ని తరలించేందుకు వైసీపీ నాయకులు ప్రైవేటు విద్యా సంస్థల బస్సులను కూడా బలవంతంగా తీసుకున్నారు. తాము బస్సులు తీసుకున్నామని చెప్పి...విద్యా సంస్థలకు సెలవు ఇచ్చేసి, పార్టీకి చెడ్డపేరు తెస్తే ఊరుకోబోమని ఆయా యాజమాన్యాలను హెచ్చరించారు. బస్సులు లేకపోయినా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలని, సెలవు మాత్రం ఇవ్వకూడదని స్పష్టంచేశాయి.

నాడు టీడీపీకి మొండిచేయి

గత నెలలో తెలుగుదేశం పార్టీ భోగాపురం మండలం పోలిపల్లిలో ‘యువగళం..నవశకం’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. దీనికి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చారు. ఈ సభ కోసం బస్సులు కావాలని ఆర్టీసీ ఎండీకి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ రాస్తే, ముందు అంగీకరించి, ఆ తరువాత ఇవ్వలేమని చేతులెత్తేశారు. ప్రైవేటు సంస్థల నుంచి సమీకరించుకోవాలని ప్రయత్నిస్తే...ఆయా సంస్థల యాజమాన్యాలను బెదిరించారు. బస్సులు ఇస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. దాంతో టీడీపీ శ్రేణులు సొంత వాహనాలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై సభకు వెళ్లారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదని నాడు అధికారులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు సగం బస్సులను వైసీపీ సభ కోసం ఇవ్వడం వల్ల ప్రయాణాకులకు ఇబ్బందులు కలగవా?..అని తెలుగుదేశం వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

Updated Date - Jan 27 , 2024 | 06:55 AM

Advertising
Advertising