ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఓటు వేయాలంటే 30 కిలోమీటర్లు నడవాల్సిందే..

ABN, Publish Date - May 09 , 2024 | 01:22 AM

జిల్లాలోని మారుమూల కొండ శిఖర గ్రామాల గిరిజనులు ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాలంటే 30 కిలో మీటర్లు నడవాల్సిన దుస్థితి నెలకొంది. ఎంతో కష్టపడి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు వేస్తే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాప్రతినిధులు తమను పట్టించుకోవడం లేదని, గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని గుర్రాలు ఎక్కి నిరసన తెలుపుతున్న మాడ్రెబు గ్రామ గిరిజనులు

- రహదారి సౌకర్యం లేక అనంతగిరి మండలంలోని మారుమూల గ్రామాల గిరిజనుల ఇబ్బందులు

- పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాలంటే అవస్థలు

అరకులోయ, మే 8: జిల్లాలోని మారుమూల కొండ శిఖర గ్రామాల గిరిజనులు ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాలంటే 30 కిలో మీటర్లు నడవాల్సిన దుస్థితి నెలకొంది. ఎంతో కష్టపడి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు వేస్తే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాప్రతినిధులు తమను పట్టించుకోవడం లేదని, గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రహదారి సౌకర్యం లేదంటూ అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ మాడ్రేబు గ్రామ గిరిజనులు గుర్రాలు ఎక్కి వినూత్నంగా నిరసన తెలిపారు.

మాడ్రేబు పీవీటీజీ గ్రామంలో 170 మంది జనాభా ఉన్నారు. వీరిలో 70 మందికి ఓటర్లు ఉన్నారు. వీరంతా ఓటు వేయడానికి 30 కిలో మీటర్ల దూరాన ఉన్న పెదకోట పోలింగ్‌ కేంద్రానికి నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఈ గ్రామానికి పక్కనే ఉన్న జీనబాడు పంచాయతీ పరిధి దాయెర్తి పీవీటీజీ గ్రామంలో 22 మంది ఓటర్లు ఉన్నారు. వీరు కూడా 30 కిలోమీటర్లు దూరాన ఉన్న జీనబాడు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాల్సిందే. జీనబాడు, పెదకోట, కివర్ల పంచాయతీ పరిధిలోని పలు కొండ శిఖర గ్రామాలకు రహదారి సౌకర్యం లేక కాలినడకనే పంచాయతీ కేంద్రాలకు చేరాల్సి ఉంటుంది. ఈ గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురైతే డోలీ మోతలే శరణ్యం. ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుమార్లు తమ సమస్యలను వెల్లడించామని, వారు స్పందించి ఉంటే రహదారి కష్టాలు తీరేవని పెదకోట, జీనబాడు పంచాయతీల గిరిజన సంఘం ప్రతినిధులు కొండ, నర్సింగరావు, దాసు, సీదరి సుధాకర్‌, ఏపీ గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్‌ సాధన కమిటీ గౌరవ అధ్యక్షుడు కె.గోవిందరావు తెలిపారు.

Updated Date - May 09 , 2024 | 01:22 AM

Advertising
Advertising