ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీజేఎల్పీ నేతగా విష్ణుకుమార్‌రాజు

ABN, Publish Date - Jul 28 , 2024 | 03:28 AM

బీజేపీ శాసనసభా పక్ష (బీజేఎల్పీ) నేతగా పి.విష్ణుకుమార్‌రాజు ఎంపికయ్యారు.

పార్టీ విప్‌గా ఆదినారాయణరెడ్డి

అమరావతి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): బీజేపీ శాసనసభా పక్ష (బీజేఎల్పీ) నేతగా పి.విష్ణుకుమార్‌రాజు ఎంపికయ్యారు. సి.ఆదినారాయణరెడ్డిని పార్టీ విప్‌గా నియమించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడికి లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారు. ఆయన 2014-19లోనూ ఐదేళ్లపాటు బీజేఎల్పీ నేతగా వ్యవహరించారు. టీడీపీ, జనసేన కూటమితో జట్టుకట్టిన బీజేపీ మొన్నటి ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా 8 మంది విజయం సాధించారు. వీరిలో విష్ణుకుమార్‌ నుంచి విశాఖ ఉత్తర ఎమ్మెల్యేగా గెలుపొందారు. ధర్మవరం నుంచి గెలిచిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌కు రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం లభించింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆదినారాయణరెడ్డి బీజేపీ తరఫున జమ్మలమడుగు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విష్ణుకుమార్‌రాజు మీడియాతో మాట్లాడుతూ.. బీజేఎల్పీ నేతగా తనకు అధిష్ఠానం అప్పగించిన బాధ్యతను ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగిస్తానని చెప్పారు. రాష్ట్రం గడిచిన ఐదేళ్లలో అన్ని విధాలా నాశనమైందని, కక్షపూరిత రాజకీయాలు తప్ప జగన్‌ ఏమీ చేయలేదని, ఆయన బాధితుల్లో తానూ ఒకడినని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పురోభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 03:28 AM

Advertising
Advertising
<