లైంగికదాడి కేసులో 22 ఏళ్ల జైలు
ABN, Publish Date - Oct 02 , 2024 | 12:21 AM
పాత బొబ్బిలి ప్రసాద్ నగర్ కాలనీకి చెందిన డొంకా రమేష్‌కు లైంగిక దాడి కేసులో 22 సంవత్సరాల కారాగార శిక్ష, రెండువేల రూపాయల జరి మానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
బొబ్బిలి: పాత బొబ్బిలి ప్రసాద్ నగర్ కాలనీకి చెందిన డొంకా రమేష్‌కు లైంగిక దాడి కేసులో 22 సంవత్సరాల కారాగార శిక్ష, రెండువేల రూపాయల జరి మానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. సీఐ కటకం సతీష్‌కుమార్ కథనం మేరకు.. 2020 మార్చి ఒకటో తేదీన ఓ గ్రామంలోని ఓ ఇంట్లోకి డొంకా రమేష్ మద్యం మత్తులో చొరబడి వివాహితపై లైంగికదాడికి పాల్పడినట్లు ఫిర్యాదు రావ డంతో అప్పటి సీఐ ఈ.కేశవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రాసిక్యూ షన్ ఆరోపణలు కోర్టులో రుజువు కావడంతో ముద్దాయికి విజయనగరం ఐదో ఏడీజే కమ్ ఉమెన్‌కోర్టు న్యాయాధికారి ఎన్.పద్మావతి మంగళవారం జైలు శిక్ష, జరిమానా విధించారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఎం.రవీంద్రనాథ్ వ్యవహరించారు. కేసులో సేవలందించిన హెచ్‌సీ సీహెచ్ స్వామినాయుడును సీఐ సతీష్‌కుమార్ అభినందించారు.
Updated Date - Oct 02 , 2024 | 12:21 AM