ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

82 శాతం పూర్తి

ABN, Publish Date - Oct 01 , 2024 | 11:47 PM

జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో సభ్యుల వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చేందుకు నేటితో గడువు ముగియనుంది. అయితే ఇప్పటివరకు బత్తిలి, పార్వతీపురం పీఏసీఎస్‌లు శతశాతం ఆన్‌లైన్‌ ప్రక్రియను పూర్తి చేశాయి.

పార్వతీపురం పీఏసీఎస్‌ కార్యాలయం

పార్వతీపురం, బత్తిలిలో శతశాతం

రాష్ట్రంలో జిల్లాకు ప్రథమ స్థానం

నేటితో ముగియనున్న గడువు

పార్వతీపురం, అక్టోబరు1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో సభ్యుల వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చేందుకు నేటితో గడువు ముగియనుంది. అయితే ఇప్పటివరకు బత్తిలి, పార్వతీపురం పీఏసీఎస్‌లు శతశాతం ఆన్‌లైన్‌ ప్రక్రియను పూర్తి చేశాయి. మిగిలిన సహకార సంఘాల్లోనూ సుమారు 82 శాతం వరకు కంప్యూటరీకరణ పూర్తయ్యింది. మిగిలిన 18 శాతం పూర్తి చేసేందుకు మరికొన్ని రోజులు గడువు పొడిగించే అవకాశముంది. ఏదేమైనా వ్యవసాయ సహకార సంఘాలను గాడిలో పెట్టేందుకు చేపడుతున్న ప్రక్రియ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఆన్‌లైన్‌ విధానం పూర్తయితే భవిష్యత్‌లో పీఏసీఎస్‌ల్లో అక్రమాలకు చెక్‌ పడనుంది. అర్హులు రుణాలు పొందే అవకాశం ఉంది. రైతులకు పారదర్శకంగా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందనున్నాయి. రాజకీయ నేతల సిఫారసులకు బ్రేక్‌ పడనుంది. వాస్తవంగా జిల్లాలో 43 సహకార సంఘాల్లో గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుకళ్లు పీఏసీఎస్‌ మూతపడింది. మిగిలిన 42 పీఏసీఎస్‌ల్లో 58,794 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 51,288 మంది సభ్యుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. ఆధార్‌ అనుసంధానమైన సభ్యులు, రుణాలు తీసుకున్న రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. బోగస్‌ సభ్య త్వాలతో పాటు మృతి చెందిన వారి పేర్లను తొలగిస్తున్నారు. ఇప్పటివరకు పీఏసీఎస్‌ల ద్వారా వివిధ రకాల రుణాల కింద సభ్యులకు రూ.67.15 కోట్లు మంజూరు చేశారు. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం పీఏసీఎస్లకు అధికారులను పర్సన్‌ ఇన్‌చార్జిలుగా నియ మించింది. ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత త్వరలోనే సొసైటీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు శరవేగంగా ఆన్‌లైన్‌లో రైతుల వివరాలు పొందుపరుస్తున్నట్లు జిల్లా సహకార శాఖ అధికారి పి.శ్రీరామ్మూర్తి తెలిపారు.

Updated Date - Oct 01 , 2024 | 11:47 PM