తల్లికి తలకొరివి పెట్టిన కుమార్తె
ABN, Publish Date - Nov 17 , 2024 | 12:01 AM
ఓ కుమార్తె తన తల్లికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది.
కొత్తవలస, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఓ కుమార్తె తన తల్లికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. స్థానికుల కథనం మేరకు తుమ్మికాపల్లి పంచాయతీ వినాయక నగర్‌లో ఉంటున్న రాజులమ్మ అనే వృద్ధురాలికి భర్త ఉన్నా ఎటూ కదలేని పరిస్థితి. ఆమెకు నూకరత్నం అనే కుమార్తె ఉంది. రాజులమ్మ టిఫిన్ సెంటర్ పెట్టుకుని భర్తను పోషించుకుంటోంది. కొద్దినెలలుగా ఆమె ఆరోగ్యం దెబ్బతినడంతో స్థానికంగా ఉన్న ఫర్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా బియ్యం, నిత్యావసరాలను అందిస్తున్నారు. శుక్రవారం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో విశాఖ కేజీహెచ్‌లో చేర్పించారు. అక్కడే బ్రెయిన్ స్ర్టోక్‌తో శనివారం తెల్లవారు జామున మృతి చెందింది. అక్కడి నుంచి రాజులమ్మ భౌతిక కాయాన్ని వినాయక నగర్ తీసుకొచ్చారు. తల్లి మృతి విషయం తెలుసుకున్న నూకరత్నం వచ్చి తలకొరివి పెట్టి...అంతిమ సంస్కారాలు పూర్తి చేసింది.
Updated Date - Nov 17 , 2024 | 12:02 AM