ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిరాశలో చెరకు రైతు

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:05 AM

బొబ్బిలి సమీపంలో లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌, బీమసింగి సహకార చక్కెర కర్మాగారాలు తెరచుకోక పోవడంతో చెరకు రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నా రు.

బొబ్బిలి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి సమీపంలో లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌, బీమసింగి సహకార చక్కెర కర్మాగారాలు తెరచుకోక పోవడంతో చెరకు రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నా రు. క్రషింగ్‌ సీజన్‌ నేపథ్యంలో చెరకు రైతులు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది. గతంలో మాదిరిగానే చెరకును సంకిలి ఫ్యాక్టరీకి తరలించుకోవాల్సి వస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చక్కెర కర్మాగారాల విషయంలో ఎన్నో హామీలు గుప్పించారు. కర్మాగారాలైతే తెరుచుకోలేదు. రైతులకు అవస్థలు తప్పలేదు.

ఫ సంకిలి ఫ్యాక్టరీలో బుధవారం నుంచి క్రషింగ్‌ ప్రారంభం కానున్నది. ఈ ఏడాది చెరకు మద్దతు ధర రూ.2,150గా నిర్ణయించారు. సంకిలి, లచ్చయ్యపేట, బీమసింగి ఫ్యాక్టరీల పరిధిలో మొత్తం 4.10 లక్షల టన్నుల చెరకును ఈ ఏడాది క్రషింగ్‌ చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు.

తగ్గిన సాగు విస్తీర్ణం

ఈ ఏడాది లచ్చయ్యపేట ఫ్యాక్టరీ పరిధిలోని 15 మండలాల్లో 16.33 హెక్టార్లు, బీమసింగి పరిధిలో 212.69 హెక్టార్లు, సంకిలి పరిధిలో 4622.66 హెక్టార్లలో మొత్తం 6,468.55 హెక్టార్లలో చెరకు పంట సాగు చేశారు. 2021-22 సీజన్‌లో 9,472.03 హెక్టార్లలో సాగు చేశారు. ఇలా పంట సాగు విస్తీర్ణం ప్రతి ఏటా గణనీయంగా తగ్గుతోంది.

చెరకు తూనిక కేంద్రాలను పెంచాం

గత సీజన్‌లో కన్నా ఈ ఏడాది చెరకు తూనిక కేంద్రాల సంఖ్యను 13కి పెంచాం. దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపాం. 25 నుంచి 30 టన్నుల పైగా మొక్క చెరకు పంటను ఇచ్చిన రైతులకు అదనంగా టన్నుకు రూ.200, మమ్ము చెరకుకు రూ.100 చొప్పన చెల్లిస్తారు. సంకిలి ఫ్యాక్టరీకి చెరకు రవాణాకు గాను 75 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రైతులు 35 కిలోమీటర్ల వరకు రవాణా చార్జీలు భరించాల్సి ఉంటుంది. ప్రతి 15 రోజులకోసారి చెల్లింపులు జరుగుతాయి.

- జీవీవీ సత్యనారాయణ, డిప్యూటీ కేన్‌ కమిషనర్‌, బొబ్బిలి

Updated Date - Nov 20 , 2024 | 12:05 AM