ఆక్రమణదారులపై చర్యలు చేపట్టాలి
ABN, Publish Date - Nov 16 , 2024 | 11:50 PM
తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని పాలకొండ సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.
పాలకొండ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని పాలకొండ సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఈనెల 13న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన సాగునీరు వృథా శీర్షికకు ఆయన స్పందించారు. ఈ మేరకు శనివారం ఏలాం జంక్షన్‌లోని ఆక్రమణలకు గురైన ఇరిగేషన్ కాలువను, సీఎల్ నాయుడు కాలనీ శివారు ప్రాంతం లో సాగునీరు వృథాగా పోవడాన్ని పరిశీలించారు. కాలువల ఆక్రమణ లతోనే సాగునీరు ప్రధాన రహదారులపై వస్తుందని ఇరిగేషన్ జేఈలు శంకరరావు, కార్తీక్ ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పాలకొండ పట్టణం గుండా వడమకు వెళ్తున్న సాగునీటి కాలువ ఆక్రమణలకు గురైన తీరును పరిశీలించి నగర పంచాయతీ, ఆర్‌అండ్‌బీ, నీటి పారుదల శాఖ అధికారులు సమగ్ర చర్యల చేపట్టాలని ఆయన ఆదేశించారు.
Updated Date - Nov 16 , 2024 | 11:50 PM