పోసాని కృష్ణమురళీపై చర్యలు తీసుకోవాలి
ABN, Publish Date - Nov 15 , 2024 | 12:05 AM
కూటమి నాయకులపై అనుచిత వాఖ్యలు చేస్తూ వారి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐపీవీ రాజు ఆధ్యర్యంలో టీడీపీ నేతలు గురువారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
పోసాని కృష్ణమురళీపై చర్యలు తీసుకోవాలి
ఎస్పీకి టీడీపీ నాయకుల ఫిర్యాదు
విజయనగరం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి) : కూటమి నాయకులపై అనుచిత వాఖ్యలు చేస్తూ వారి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐపీవీ రాజు ఆధ్యర్యంలో టీడీపీ నేతలు గురువారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, ఐటీ మంత్రి నారా లోకేశ్, టీటీడీ చైర్మన్‌పై పోసా ని కృష్టమురళి అసత్య ఆరోపణలు, పరుస పదజాలంతో మాట్లాడారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేసి వారి గౌరవానికి భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కనకల మురళీమోహన్, విజ్జపు వెంకటప్రసాద్, ప్రసాదుల ప్రసాద్, కర్రోతు నర్సింగరావు, ఆల్తి బంగారుబాబు తదితరులు పాల్గొన్నారు.
రాజాం స్టేషన్‌లోనూ ఫిర్యాదు
రాజాం/ రూరల్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి):
సోషల్ మీడియా వేదికగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు, సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కూటమి నాయుకులు డిమాండ్ చేశారు. టీడీపీ రాజాం నాయకులు వంగా వెంకటరావు, గురవాన నారాయణరావు, అద్దంకి గోపి, గ్రంధి గోపి, ఉరిటి సురేంఽద్ర, బీజేపీ నాయకులు కోటగిరి నారాయణరావు, రంజిత్ తదితరులు టౌన్ సర్కిల్ కార్యాలయం ప్రాంగణంలో తొలుత విలేకరులతో మాట్లాడారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అనంతరం రాజాం టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.అశోక్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
Updated Date - Nov 15 , 2024 | 12:05 AM