ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మస్తర్లలో దిద్దుబాట్లు లేకుండా చర్యలు

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:21 AM

ఉపాధి కూలీలకు సంబంధించిన మస్తర్లలో దిద్దుబాట్లు లేకుండా క్షేత్ర సహాయకులు చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ జి.ఉమాపరమేశ్వరి కోరారు. బుధవారం బొండపల్లి మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన వివిధ పనులపై సోషల్‌ తనిఖీ ప్రజావేదిక సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న డ్వామా పీడీ ఉమాపరమేశ్వరి:

బొండపల్లి: ఉపాధి కూలీలకు సంబంధించిన మస్తర్లలో దిద్దుబాట్లు లేకుండా క్షేత్ర సహాయకులు చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ జి.ఉమాపరమేశ్వరి కోరారు. బుధవారం బొండపల్లి మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన వివిధ పనులపై సోషల్‌ తనిఖీ ప్రజావేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూలీలకు వేతనాల రూపంలో పంచాయతీరాజ్‌ విభాగంలో వివిధ పనుల కింద సోషల్‌ ఫారెస్టు అభివృద్ధి, చెట్ల పెంపకం కింద రూ.20.96 కోట్లు పైగా ఖర్చుచేయగా సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి నట్లు తెలిపారు. తమటాడలో 18 మంది కూలీలు పనులకు వెళ్లకుండానే మస్టర్లు వేసి డబ్బులు డ్రా చేశారని కొంతమంది డీఆర్పీల కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగా దీనికి స్పందించిన పీడీ ఈ ఫిర్యాదుపై గ్రామంలో సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని సూచించారు. పని ప్రదేశాల్లో నీరు, నీడ వంటి ఏర్పాట్లు కల్పించడం లేదని చాలా గ్రామాల్లో కూలీలు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు డీఆర్పీలు తెలియచేశారు. ప్రభుత్వం కొద్దేళ్లుగా టెంట్లు, మెడికల్‌ కిట్లు సరఫరా చేయడం లేదని, అందిస్తే కూలీలకు అందించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పలు గ్రామాల్లో చనిపోయిన వారికి డీబీటీ ద్వారా పింఛన్లు అందించినట్లు గుర్తించగా వారి నుంచి రికవరీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ చల్లా చలంనాయుడు, క్లస్టర్‌ ఏపీడీ జి.జనార్దనరావు, డీవీవోలు వెంకట రమణ, ఎ.భానూజీరావు, పింఛన్ల ఏపీడీ రమేష్‌, ఎస్‌ఆర్‌పీ ఎస్‌.లక్ష్మణరావు, ఎంపీడీవో వైవీ రాజేంద్రప్రసాద్‌, ఏపీవో బి.కృష్ణవేణి, పంచాయతీ రాజ్‌ జేఈఈ కె.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:21 AM

Advertising
Advertising