ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చురుగ్గా గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులు

ABN, Publish Date - Oct 06 , 2024 | 11:31 PM

జిల్లాలో విశాఖ-రాయపూర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులు చురుగ్గా సాగుతు న్నాయి.

గంట్యాడ: జిల్లాలో విశాఖ-రాయపూర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులు చురుగ్గా సాగుతు న్నాయి. కొత్తవలస నుంచి మెంటాడ వరకూ సుమారు 40 కిలోమీటర్ల పనులు చేప డుతున్నారు.రోడ్డు పనులు కొంత వరకు పూర్తయినా, మొక్కలు నాటడం తదితర చిన్న చిన్న పనులు చేయాల్సిఉంది. కొర్లాం వద్ద ఇంటర్‌ చెంజ్‌ పనులు సాగుతున్నాయి. ఈ హైవే నిర్మాణం వల్ల విజయనగరం, ఎస్‌.కోట నుంచి వచ్చే వాహనాలు నేరుగా జాతీయరహదారిపై వెళ్లడానికి అవకాశంలేదు. ప్రధాన రహదారికి అనుసంధానం చేస్తూ ఏర్పాటుచేసిన రహదారి గుండా వెళ్లాలి.అలాగే రామవరం నుంచి చిలకలగెడ్డ వరకూ రోడ్డు కూడా విస్తరించారు.విశాఖ నుంచి రాయపూర్‌ వరకూ ఆరులైన్ల గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి నిర్మాణానికి కేంద్రరోడ్డు రవాణాశాఖ నిధులు మంజూరుచేసిన విష యం విదితమే. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం తర్వాత ఈ ప్రాంతం రూపురేకలు పూర్తిగా మారిపోయాయి. చుట్టు రహదారి మధ్యలో పచ్చని పొలాలుతో దర్శనమిస్తున్నాయి.

Updated Date - Oct 06 , 2024 | 11:31 PM