సరుకులన్నీ ఒకేసారి సరఫరా
ABN, Publish Date - Nov 24 , 2024 | 12:08 AM
రేషన్ డీపోలకు బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులన్నీ ఒకేసారి సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ శోభిక ఆదేశించారు. శనివారం పట్టణంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మింగా సందర్శించారు.
సాలూరు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): రేషన్ డీపోలకు బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులన్నీ ఒకేసారి సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ శోభిక ఆదేశించారు. శనివారం పట్టణంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మింగా సందర్శించారు. ఇప్పటివరకు ఎన్ని రేషన్ డీపోలకు సరుకులు సరఫరా చేశారని సీఎస్‌డీటీ రంగారావును ప్రశ్నించారు. డిపోలకు పంపించే సరుకుల వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. డీలర్లు సమస్యను పరిష్కరించి లబ్ధిదారులకు సక్రమంగా రేషన్ సరుకులు అందించాలని సూచించారు. అనంతరం ఎంఎల్‌ఎస్ గోదామును పరిశీలించారు. సరుకుల వివరాలను గోదాము ఇన్‌చార్జిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీఆర్వోలతో మాట్లాడారు.
సాలూరుకు ధాన్యం పంపే ఏర్పాట్లు చేస్తాం
సాలూరు రూరల్: శివరాంపురం పీఏసీఎస్ కొనుగోలు కేంద్ర పరిధిలో ధాన్యం సాలూరు మిల్లుకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని జేసీ శోభిక తెలిపారు. శివరాంపురం పీఏసీఎస్ ద్వారా ధాన్యం కొనుగోలును పరిశీలించారు. తమ పంటను మిర్తివలస, కొట్టక్కి మిల్లులకు పంపించేందుకు అనుమతించాలని స్థానిక రైతులు ఆమెను కోరారు. కాగా ఆయా మిల్లులు పక్క జిల్లా ( విజయనగరం) పరిధిలో ఉన్నందున అక్కడకి పంపడానికి వీలుకాదన్నారు. సాలూరుకు పంపించడానికి బ్యాంక్ గ్యారెంటీని తీసుకోనున్నామన్నారు. ప్రస్తుతం సీతానగరం మిల్లులకు పంపించొచ్చని తెలిపారు. తహసీల్దార్ ఎన్వీరమణ, ఏవో అనురాధ పండా తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 24 , 2024 | 12:08 AM