ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లా కలెక్టర్‌గా అంబేడ్కర్‌

ABN, Publish Date - Jun 22 , 2024 | 11:55 PM

జిల్లా నూతన కలెక్టర్‌గా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నియమితులయ్యారు. ప్రస్తుత కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మికి గుంటూరు బదిలీ అయింది.

నాగలక్ష్మికి గుంటూరు బదిలీ

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

జిల్లా నూతన కలెక్టర్‌గా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నియమితులయ్యారు. ప్రస్తుత కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మికి గుంటూరు బదిలీ అయింది. ఈ మేరకు శనివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కలెక్టర్‌ అంబేడ్కర్‌కు గతంలో ఉమ్మడి జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది. పార్వతీపురం ఆర్డీవోగా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. జిల్లా సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. దీంతో పరిపాలనా సౌలభ్యంతో పాటు త్వరగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఈయన విద్యా శాఖలో మధ్యాహ్న భోజన పథకం అమలు, పరిశుభ్రత కార్యక్రమాల డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. గుంటూరు కలెక్టర్‌గా బదిలీ అయిన ఎస్‌.నాగలక్ష్మి జిల్లాలో ఎటువంటి వివాదాస్పద నిర్ణయాలకు తావులేకుండా పనిచేశారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేశారు. అయితే అక్రమాలకు పాల్పడే అధికారులపై చర్యలు తీసుకోలేక పోయారన్న విమర్శలు ఉన్నాయి. ఆమె కఠినంగా వ్యవహరించక పోవడంతో మిగిలిన శాఖాధిపతులకు ఎవరు సమాచారం అడిగినా, మీడియా పరమైన సమాచారం అడిగినా కలెక్టర్‌ను అడగండని చెపుతుంటేవారు. శాఖల సాధారణ సమాచారం కూడా ఇవ్వకుండా కలెక్టర్‌పైకి నెట్టేసివారు.

Updated Date - Jun 22 , 2024 | 11:56 PM

Advertising
Advertising