ఆశాల ఆందోళన
ABN, Publish Date - Nov 18 , 2024 | 11:39 PM
తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు, సీహెచ్‌డబ్య్లూలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.
బెలగాం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు, సీహెచ్‌డబ్య్లూలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని.. పని భారం తగ్గించాలని, కనీస వేతనం అమలు చేయాలని వారు నినదించారు. తమకు ఇన్సూరెన్స్ అమలు చేయాలని, బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని , సీహెచ్ డబ్య్లూలను ఆశాలుగా గుర్తించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, పదవీ విరమణ వయస్సు 62కు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఆయా సంఘాల నాయకులు గౌరీశ్వరి, శివాణి, బృంద, రజని, సీఐటీయూ నాయకులు మన్మధరావు, కొల్లి సాంబ, సౌజన్య, ఇందిరా తదితరలు పాల్గొన్నారు.
Updated Date - Nov 18 , 2024 | 11:39 PM