పేకాట శిబిరంపై దాడి
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:19 AM
జిల్లాలో ఎక్కడైనా పేకాట శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. గురువారం రాత్రి నగరంలోని ఎస్‌వీఎన్ నగర్‌లోని సుజాత కన్వెన్షన్ హాల్లో పేకాట శిబిరంపై విజయనగరం డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి 42 మందిని అరెస్టు చేశారు.
- 42 మంది అరెస్టు
- రూ.17 లక్షల నగదు, 49 సెల్‌ఫోన్లు, రెండు కార్లు, మోటారు సైకిళ్లు స్వాధీనం
- 14 మందిపై సస్పెక్టడ్ షీట్లు ఓపెన్ చేస్తాం
- ఎస్పీ వకుల్ జిందాల్
విజయనగరం క్రైం, నవంబరు 15: (ఆంరఽధజ్యోతి): జిల్లాలో ఎక్కడైనా పేకాట శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. గురువారం రాత్రి నగరంలోని ఎస్‌వీఎన్ నగర్‌లోని సుజాత కన్వెన్షన్ హాల్లో పేకాట శిబిరంపై విజయనగరం డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి 42 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.17,34,190 నగదు, రెండు కార్డు, రెండు మోటారు సైకిళ్లు, 49 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గదులు అద్దెకు తీసుకున్న అగ్రిమెంటు కాపీని సీజ్ చేశారు. ఈ వివరాలను ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. గురువారం రాత్రి సుజాత కన్వెన్షన్ హాల్లో కొంత మంది వ్యక్తులు గదులను అద్దెకు తీసుకుని పేకాట నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అందింది. దీంతో డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ కృష్ణమూర్తి, ఏఎస్‌ఐ గౌరీనాయుడు, పోలీసు బృందంతో దాడి చేశారు. పూసపాటిరేగకు చెందిన కాకర్లపూడి కృష్ణమూర్తిరాజుతో పాటు పేకాట ఆడుతున్న 41 మందిని అరెస్టు చేశామన్నారు. వీరిలో 14 మందిపై ఇప్పటికే వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో పేకాట కేసులు ఉన్నాయన్నారు. వీరిపై సస్పెక్టడ్ షీట్లు తెరుస్తామన్నారు. ఫంక్షన్ హాల్ నిర్వహకుల పాత్రపై కూడా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందించారు.
Updated Date - Nov 16 , 2024 | 12:19 AM