ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బురదనీటిలో బైఠాయించి.. నిరసన

ABN, Publish Date - Aug 21 , 2024 | 12:06 AM

బొబ్బిలి పట్టణం ఫూల్‌బాగ్‌ రోడ్డులోని బురదనీటి గుంటలో ఎస్‌ ఎఫ్‌ఐ కార్యకర్తలు మంగళవారం బైఠాయించి వినూత్నంగా ఆందోళన చేపట్టారు.

బొబ్బిలి: బొబ్బిలి పట్టణం ఫూల్‌బాగ్‌ రోడ్డులోని బురదనీటి గుంటలో ఎస్‌ ఎఫ్‌ఐ కార్యకర్తలు మంగళవారం బైఠాయించి వినూత్నంగా ఆందోళన చేపట్టారు. ఫూల్‌బాగ్‌ రోడ్డులో విద్వాన్‌, సత్యసాయి, గాయత్రి, సాయిరాం, తాండ్రపాపా రాయ, రాజా కళాశాల, సంస్థానం హైస్కూలు తదితర విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ రోడ్డు అధ్వానంగా తయారవడంతో నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నా యని, భారీ వాహనాలు నిలిచిపోతుండడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోతోందని ఎస్‌ ఎఫ్‌ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు కిరణ్‌, మణికుమార్‌లు ఆరోపించారు. తె ర్లాం, బలిజిపేట, అలజంగి, కారాడ, పిరిడి, బాడంగి ప్రాంతాల నుంచి రోజూ వ చ్చే వేలాది మంది విద్యార్థులు, ప్రయాణికులు నరకం చవిచూస్తున్నారని అన్నా రు. ఆందోళన చేస్తున్న వారి దగ్గరకు మున్సిపల్‌ చైర్మన్‌ వెంకట మురళీకృష్ణా రా వు, కమిషనర్‌ లాలం రామలక్ష్మి, ఇతర అధికారులు వచ్చి వారంలోగా రోడ్డు మర మ్మతులు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళనను విరమించారు.

Updated Date - Aug 21 , 2024 | 12:06 AM

Advertising
Advertising
<