ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆందోళనలో అన్నదాతలు

ABN, Publish Date - Nov 30 , 2024 | 11:46 PM

ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో రెండు రోజులుగా జిల్లాలో చిరుజల్లులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షం పడుతోంది. దీంతో వరి, పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు.

పాచిపెంట మండలం గడివలస వద్ద నేలవాలిన వరిచేను

పంటను కాపాడుకునేందుకు ఆపసోపాలు

పార్వతీపురం, నవంబరు30 (ఆంధ్రజ్యోతి)

ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో రెండు రోజులుగా జిల్లాలో చిరుజల్లులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షం పడుతోంది. దీంతో వరి, పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలుల కారణంగా ఇప్పటికే కొన్ని చోట్ల వరిచేలు నేలకొరిగింది. కోతలు పూర్తయిన చోట పంటను కాపాడుకోవడానికి అన్నదాతలు ఆపసోపాలు పడుతున్నారు. వరిచేలను కుప్పలుగా పోసి టార్పాలిన్లు కప్పుతున్నారు. కొన్నిచోట్ల నూర్పులు పూర్తయినా... ఇళ్లకు తరలించకపోవడంతో కష్టాలు తప్పడం లేదు. మరోవైపు పత్తి పంట సైతం దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వర్షాల కారణంగా వరి పంటకు ఎటువంటి నష్టం లేదని జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తున్నామని తెలియజేస్తున్నారు.

Updated Date - Nov 30 , 2024 | 11:46 PM