ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సోలార్‌ రూఫ్‌ టాప్‌ నిర్మించుకోండి

ABN, Publish Date - Jul 27 , 2024 | 12:03 AM

ప్రధానమంత్రి సూర్య ఘర్‌ యోజన పథకం కింద రాయితీతో ఇంటిపై సోలార్‌ రూఫ్‌ టాప్‌ నిర్మించుకుని విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చునని జిల్లా కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు.

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: ప్రధానమంత్రి సూర్య ఘర్‌ యోజన పథకం కింద రాయితీతో ఇంటిపై సోలార్‌ రూఫ్‌ టాప్‌ నిర్మించుకుని విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చునని జిల్లా కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో ప్రధానమంత్రి సూర్యఘర్‌ యోజన పథకం గోడపత్రికను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాయితీపై అందిస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్‌ యోజన పథకం గృహ వినియోగదారులకు విద్యుత్‌ చార్జీల భారం తగ్గించుకొనేందుకు చక్కని అవకాశం అన్నారు. రాయితీని పొంది ఇంటిపై సోలార్‌ రూఫ్‌ టాప్‌ నిర్మించుకోవచ్చునన్నారు. కనీసం పది చదరపు మీటర్లు లేదా వంద చదరపు అడుగుల స్థలంలో ఒక కిలో వాట్‌ సామర్థ్యం కలిగిన సోలార్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్‌ సూపరింటెం డెంట్‌ ఇంజినీర్‌ మువ్వల లక్ష్మణరావు, కార్యనిర్వాహక ఇంజనీర్‌ వీవీ కిషోర్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎం.రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:03 AM

Advertising
Advertising
<