ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిగ్గు తేల్చేనా?

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:14 AM

వైసీపీ పాలనలో జిల్లాలో జరిగిన ఫ్రీహోల్డ్‌ భూ దందాపై లోతైనా విచారణ చేపట్టాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది.

- ఫ్రీహోల్డ్‌ భూ దందాపై లోతైనా విచారణ

- మూడు నెలల సమయమిచ్చిన ప్రభుత్వం

-నిర్లక్ష్యంగా వ్యహరించిన తహసీల్దార్లకు మెమోలు

- వైసీపీ నేతల్లో అలజడి

విజయనగరం నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో జిల్లాలో జరిగిన ఫ్రీహోల్డ్‌ భూ దందాపై లోతైనా విచారణ చేపట్టాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది. నిజాలు నిగ్గు తేలే వరకూ ఆ భూముల క్రయ విక్రయాలను నిషేధించింది. ఇప్పటికే దీనిపై జీవో జారీ చేసింది. తాజాగా, ఈ నిషేధాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించింది. ఈ మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. గతంలో జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన 10 మంది తహసీల్దార్లకు మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వ చర్యలతో జిల్లా వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

అంతా బినామీలే..

వైసీపీ ప్రభుత్వంలో అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఆ పార్టీ నేతలు భూదందాకు తెరలేపారు. అసైన్డ్‌ భూములతో పాటు మాజీ సైనికుల పేరిట ప్రభుత్వ భూమిని కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. 2003 సంవత్సరానికి ముందు మంజూరు చేసిన డి.పట్టా భూములను రెగ్యులర్‌ (ఫ్రీహోల్డ్‌) చేసింది వైసీపీ ప్రభుత్వం. సరిగ్గా ఎన్నికలకు కొద్ది నెలల ముందు జీవో ఇచ్చింది. ఆ జీవోను అడ్డం పెట్టుకొని ఎక్కడికక్కడే అసైన్డ్‌ లబ్ధిదారుల నుంచి వైసీపీ నేతలు చౌకగా భూములను కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటిలో వైసీపీ ప్రభుత్వ ఒత్తిడి మేరకు రెవెన్యూ అధికారులు కొన్ని చోట్ల నిబంధనలు ఉల్లంఘించి ఫ్రీహోల్డ్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా 5,618 ఎకరాల భూమిపై నిషేధం తొలగించారు. కొన్నిచోట్ల ఈ భూములు క్రయవిక్రయాలు జరిగాయి. 191 ఎకరాలను విక్రయిస్తూ రిజిస్ర్టేషన్లు సైతం పూర్తిచేశారు. భోగాపురం, ఎస్‌.కోట, కొత్తవలస, గజపతి నగరం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అసైన్డ్‌ భూముల రిజిస్ర్టేషన్లు జరిగినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అసైన్డ్‌ భూములను వైసీపీ నేతలు కారుచౌకగా కొట్టేయడంపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఫ్రీహోల్డ్‌ చేసిన భూములను మరోసారి పున:పరిశీలన చేయాలని ఆదేశించింది. అప్పటివరకూ రిజిస్ర్టేషన్లు చెల్లవని తేల్చిచెప్పింది. వీటిపై సీరియస్‌గా దృష్టిపెట్టాలని తహసీల్దార్లకు కూటమి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కానీ, అప్పట్లో వైసీపీ నేతలతో ఉన్న అనుబంధం, పరిచయాలు దృష్ట్యా తహసీల్దార్లు పెద్దగా దృష్టిపెట్టలేదు. దీంతో ప్రభుత్వం ఒక్కసారిగా సీరియస్‌ అయ్యింది. 10 మంది తహసీల్దార్లకు మెమోలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఫ్రీహోల్డ్‌లోకి వచ్చిన భూములు, రిజిస్ర్టేషన్లపై లోతైన దర్యాప్తు రెవెన్యూ శాఖ చేపడుతోంది. బినామీల పేరిట దోచేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తెగ భయపడిపోతున్నారు.

కీలక నేతలు, అధికారులు..

జిల్లాలో అసైన్డ్‌ భూములను సొంతం చేసుకున్నవారిలో రాష్ట్రస్థాయి వైసీపీ నేతలు, ఆ ప్రభుత్వ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. 20 ఏళ్లు పూర్తయిన డీపట్టాలు విక్రయించుకోవడానికి వీలుగా వైసీపీ ప్రభుత్వం జీవో ఇస్తుందని తెలిసి వారంతా జిల్లాలో భారీ స్థాయిలో భూములు కొనుగోలు చేసినట్టు సమాచారం. జీవో రాక మునుపే డీపట్టాదారులతో ఒప్పందం చేసుకున్నారు. వారి చేతుల్లో లక్షలను పెట్టి కోట్ల రూపాయల విలువచేసే భూములను సొంతం చేసుకున్నారు. భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, చీపురుపల్లి, గరివిడి, గజపతినగరం, ఎస్‌.కోట, వేపాడ, లక్కవరపుకోట మండలాల్లో ఎక్కవగా భూ దందా సాగినట్టు తెలుస్తోంది. దీంతో గత ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీహోల్డ్‌ జీవోను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. నిజాలు నిగ్గు తేలేవరకూ ఆ భూముల క్రయ విక్రయాలను నిషేధించింది. ముందుగా ఈ జీవోను నెల రోజుల పాటు నిలిపివేయగా.. పెద్ద ఎత్తున బయటపడుతున్న అక్రమాలు చూసి మరో మూడు నెలల పాటు నిషేధాన్ని పొడిగించింది. లోతైన విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. దీంతో నిజాలు నిగ్గు తేల్చే పనిలో అధికారులు పడ్డారు.

Updated Date - Nov 30 , 2024 | 12:14 AM