ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో మార్పులు

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:22 AM

జిల్లాలో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బ్రిటిష్‌ కాలం నాటి పద్దతులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది.

బొబ్బిలి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం

-ప్రత్యేక పోడియం రద్దు

-ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

బొబ్బిలి సెప్టెంబరు 15: జిల్లాలో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బ్రిటిష్‌ కాలం నాటి పద్దతులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఉండే ప్రత్యేక పోడియాన్ని రద్దు చేస్తూ.. ప్రజలను గౌర వించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇతర ప్రభుత్వ కార్యాలయాల మాదిరిగానే ఒకే ఫ్లోర్‌ కింద వాటిని తెచ్చేందుకు చర్యలు తీసుకోనున్నారు. అదేవిధంగా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి వచ్చిన వారికి కుర్చీలు, తాగునీటితో పాటు అకాశం ఉంటే టీ, కాఫీ సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సబ్‌రిజిస్ర్టార్‌ కుర్చీని కూడా ఎత్తులో కాకుండా సాధారణ ఫ్లోరింగ్‌ ఎత్తులోనే ఉండాలని సూచించింది. రిజిస్ర్టేషన్‌కి వచ్చిన ప్రజలు కూర్చుని రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలని, సబ్‌రిజిస్ర్టార్‌కి ప్రజలకు మధ్య టేబుల్‌తప్ప మరేమీ అడ్డంగా ఉండకూడదని రెవెన్యూ, రిజిస్ర్టేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా ఆదేశిం చారు. కాగా జిల్లాలో విజయనగరం, చీపురుపల్లి, ఎస్‌.కోట, గజపతినగరం, నెల్లిమర్ల, బొబ్బిలి, రాజాం ప్రాంతాల్లో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో ప్రత్యేక పోడియాన్ని తొలగించి.. ఒకే ఫ్లోర్‌లో కార్యాలయం ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు.

మళ్లీ పాత స్టాంపుల విక్రయాలు..

ఆస్తుల క్రయ విక్రయాలు, రిజిస్ర్టేషన్లు, ఒప్పందాలు, అఫిడవిట్‌లకు వినియోగించే పాత స్టాంపు పేపర్లు మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. వైసీపీ పాలనలో వాటి స్థానంలో ఈ-స్టాంపులను ప్రవేశపెట్టారు. దీంతో క్రయ, విక్రయదారుల నుంచి అభ్యంతరాలు వచ్చినా వాటిని గత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. గతంలో నాసిక్‌లో తయారయ్యే జ్యుడీషియల్‌ స్టాంపులను రిజిస్ర్టేషన్‌, అఫిడ్‌విట్‌ ఒప్పందాలు, తదితర కార్యకలాపాలకు వినియోగించేవారు. రూ.20, రూ.50 , రూ.100 స్టాంపులు సుదీర్ఘకాలంగా మన్నికగా ఉండేవి. అయితే గత వైసీపీ ప్రభుత్వం వీటిని కొనుగోలు చేయలేక నాసిక్‌ క్యాంపుల విక్రయాన్ని నిలిపివేసింది. ఈ-స్టాంపు పేరుతో నాసిరకం ప త్రాలు అందుబాటులోకి తెచ్చింది. అయితే కొద్దిరోజులకే ఈ పత్రాలు చిరిగిపోతు న్నాయంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. మరోవైపు వీటిపై సబ్‌ రిజిస్ర్టార్లు సమాధానం చెప్పలేక తలలు పట్టుకునేవారు. తాజాగా కూటమి ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ శాఖలో సంస్కరణల పేరిట పాత విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

బ్రిటీషు కాలం నాటి సంప్రదాయాలు పోవాల్సిందే

బ్రిటీషు కాలం నాటి సంప్రదాయాలు ఇంకా అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్నాయి. వాటన్నిటినీ సమూలంగా రూపుమాపాల్సిందే. ఇక నుంచి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో సబ్‌రిజిస్ర్టార్‌ కుర్చీ సాధారణ ఫ్లోరింగ్‌ ఎత్తులోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించడం శుభపరిణామం. అలాగే ఆ కార్యాలయాల్లో వేనూళ్లుకొనిఉన్న ఆమ్యామ్యాల పద్ధతికి పూర్తిగా స్వస్తి పలికేలా చర్యలు తీసుకోవాలి. అలాగే, మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఎత్తయిన కుర్చీలో చైర్మన్‌ కూర్చునే విధానంపై కూడా పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలి. అన్నింటా ప్రజాహితమైన విధానాలు వస్తే జనం హర్షిస్తారు.

-బొద్దాన అప్పారావు, టీడీపీ ఎస్సీ విభాగం నేత, బొబ్బిలి

Updated Date - Sep 16 , 2024 | 12:22 AM

Advertising
Advertising