ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెక్‌డ్యామ్‌లు ఇలా.. సాగునీరు ఎలా?

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:01 AM

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్న చెక్‌డ్యామ్‌లు నిధుల కొరత కారణంగా మరమ్మతులకు నోచుకోవడం లేదు.

నేరేడుమానుగూడ వద్ద ఉన్న చెక్‌డ్యావ్‌ పరిస్థితి ఇలా..

గుమ్మలక్ష్మీపురం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్న చెక్‌డ్యామ్‌లు నిధుల కొరత కారణంగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో గిరిజన రైతులు సాగునీటికి అవస్థలు పడు తున్నారు. గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా మరమ్మతులు చేయకపోవడంతో ఈ చెక్‌డ్యామ్‌ల పరిధిలోని ఆయకట్టు రైతులు తమ పొలా లకు సక్రమంగా సాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గుమ్మ లక్ష్మీపురం, కురపాం, జీఎంవలస, కొమరాడ పాచిపెంట, మక్కువ, సాలూరు గిరిజన మండలాల్లో సుమారు 200 వరకు చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. ఈ చెక్‌ డ్యామ్‌లను ఐపాడ్‌ టీటీజీ యాక్షన్‌ ప్లాన్‌ ఎస్టీ సబ్‌ప్లాన్‌, ఉపాధి హామీ, మైనర్‌ ఇరిగేషన్‌ రాష్ట్రీయ సంవికాస్‌ యోజన తదితర పథకాలతో పదేళ్ల కిందట నిర్మించారు. వీటితో గిరిజన రైతుల ఆయకట్టు భూమికి పుష్కలంగా సాగునీరు అందేది. వరి, ఇతర వేసవి పంటలు కూడా పండించేవారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ చెక్‌డ్యామ్‌ల నిర్వహణ మరమ్మతుల కు నిధులు కేటాయించనందున కాలువల్లో పూడికలు పెరిగిపోయాయి. ఆయకట్టు రైతులకు నీరందని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలోనైనా గిరిజన ప్రాంతంలోని చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తారని గిరిజన రైతులు ఎదురు చూస్తున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలం మంజరపు గోడ, బుద్దిడి సీమలగూడ, మండ, గాండ్ర, జేకేపాడు తదితర ప్రాంతాల్లో పెద్ద చెక్‌డ్యామ్‌లు కూడా నిర్మించారు. కనీస నిర్వహణ జరగలేదు. ప్రభుత్వం స్పందించి చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు పెద్దఎత్తున నిధులు కేటాయించాలని రైతులు కోరుతున్నారు.

వినతిపత్రాలు సమర్పించాం

గిరిజన ప్రాంతంలోని చెక్‌డ్యామ్‌లో మరమ్మతులు చేయాలని సంబంధిత ఇరిగేషన్‌ అధికారులకు, ఐటీడీఏ అధికారులకు వినతిపత్రాలు సమర్పించాం. అయినా మరమ్మతులకు నిధులు మంజూరు కాలేదు.

- కోలక అవినాష్‌, గిరిజన సంఘ నాయకుడు

Updated Date - Nov 20 , 2024 | 12:01 AM