ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వీఆర్‌పేటను సందర్శించిన కలెక్టర్‌

ABN, Publish Date - Nov 16 , 2024 | 11:48 PM

మండలంలోని వెంకటరాయుడుపేట గ్రామాన్ని కలెక్టర్‌ ఏ.శ్యామ్‌ప్రసాద్‌ శనివారం ఉదయం సందర్శించారు.

గ్రామస్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం రూరల్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంకటరాయుడుపేట గ్రామాన్ని కలెక్టర్‌ ఏ.శ్యామ్‌ప్రసాద్‌ శనివారం ఉదయం సందర్శించారు. జట్టు స్వచ్ఛంద సంస్థ వెంకటరాయుడుపేట గ్రామంలో గోశాల ఏర్పాటు చేసి, తద్వారా మోడల్‌ గ్రామంగా తీర్చి దిద్దడానికి నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్‌ సంబంధిత ప్రతినిధులతో కలిసి ఆ గ్రామాన్ని పరిశీలించారు. జిల్లాలో వివిధ మండలాల్లో పెద్ద ఎత్తున డెయిరీ స్థాయిలో నిర్వహణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని పశు సంవర్థక శాఖ అధికారులకు కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర సలహాదారు సి.శ్రీనివాసన్‌, మహిళా శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసరావు, పశు వైద్య అధికారి జయకిరణ్‌, జట్టు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పద్మజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 11:48 PM