ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఖర్చు తక్కువ చూపుతామంటే కుదరదు

ABN, Publish Date - Apr 28 , 2024 | 11:32 PM

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఖర్చులు తక్కువ చేసి చూపుతామంటే కుదరదు. ప్రస్తుత ధరలను బట్టి ఎన్నికల కమిషన్‌ దేనికి ఎంత వ్యయమవుతుందో ఓ లెక్కను సిద్ధం చేసుకుంది.

- ఈసీకీ ఓ లెక్కుంది

(సాలూరు రూరల్‌)

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఖర్చులు తక్కువ చేసి చూపుతామంటే కుదరదు. ప్రస్తుత ధరలను బట్టి ఎన్నికల కమిషన్‌ దేనికి ఎంత వ్యయమవుతుందో ఓ లెక్కను సిద్ధం చేసుకుంది. ఈ లెక్క ప్రకారం అభ్యర్థులు తమ ఖర్చులను సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారమంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అభ్యర్థి వెంట అనుచరులు వస్తారు. ప్రచారానికి వెళ్లడానికి వాహనం, అనుచరుల భోజన సదుపాయాలు చేయాల్సిందే. మరో వైపు సభలు, ర్యాలీలు చేస్తే మరింత వ్యయం. వాటికి సంబంధించిన లెక్కలను ఈసీకి అభ్యర్థులు చూపాల్సి ఉంటుంది. వాటర్‌ ప్యాకెట్‌ నుంచి సాంబారు ఇడ్లీ, చికెన్‌ బిర్యానీ, ఎక్కిన వాహనం, పెట్టిన మైక్‌, కట్టిన బ్యానర్‌, ఎగిరిన జెండాకు లెక్కలను పక్కాగా ఈసీకి చూపించాల్సిందే. అభ్యర్థుల వ్యయ పరిశీలనకు మండల, నియోజకవర్గ స్థాయిలో ఈసీ పరిశీలకులను నియమించింది.

అభ్యర్థుల వ్యయ పరిమితి

ఎన్నికలల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కేంద్ర ఎన్నికల సంఘం వ్యయ పరిమితిని విధించింది. ప్రస్తుత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి గరిష్టంగా రూ.90 లక్షలు ఖర్చు చేసుకోవచ్చు. ఎమ్మెల్యే అభ్యర్థి గరిష్టంగా రూ.40 లక్షల వ్యయం చేసుకోవచ్చు. ఎన్నికల్లో ఈసీ పరిమితి కంటే ఎక్కువగానే అభ్యర్థులు ఖర్చు చేస్తారనేది బహిరంగ రహస్యం. ఈసీకి లెక్కలు మాత్రం పరిమితి కంటే కనీసం ఐదారు లక్షల రూపాయలు తక్కువగానే చూపిస్తారు. ఎన్నికల లెక్కలు రాయడంలో ప్రతి నియోజకవర్గంలో ఆరితేరిన చిత్రగుప్తులు ఇందుకు ప్రత్యేకంగా ఉన్నారు. వారి ద్వారానే అభ్యర్థులు ఈసీకి ఇచ్చే లెక్కలను రాయిస్తారు.

ఇలా ఖర్చు చేయాలి

కోలాటానికి రూ.5000, డ్రమ్స్‌ లేదా బ్యాండ్‌ రూ.1000, లైట్స్‌ రూ.300 (రోజుకు లెక్కన), ఎనిమిది అడుగుల జెండా రూ.1500, వీడియోగ్రాఫర్‌కు రూ. 5000, పువ్వులకు రూ.350, సౌండ్‌ బాక్స్‌లకు రూ.2000, పూల బోకేకు రూ.500, కరపత్రాలు వందకు రూ.600, బిస్కెట్‌ ప్యాకెట్‌కు రూ.40, వెజిటేరియన్‌ భోజనం రూ.100, నాన్‌ వేజ్‌ భోజనం లేదా బిర్యానీ రూ.150, పూరి రూ.40, టీ రూ.10, బస్సుకు రూ.20,000, వివిధ వాహనాలకు వివిధ రేట్లు ఉన్నాయి. డ్రైవర్‌కు రోజుకు భత్యం రూ. 520... ఇలా ప్రతి దానికీ ఈసీకి ఓ లెక్క ఉంది. దానిని బట్టి ఖర్చులు సమర్పించాల్సి ఉంటుంది.

Updated Date - Apr 28 , 2024 | 11:32 PM

Advertising
Advertising