ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పత్తిని ఇచ్చి మద్దతు ధర తీసుకోండి

ABN, Publish Date - Nov 20 , 2024 | 11:48 PM

జిల్లాలో పత్తి రైతుల సౌకర్యార్థం రామభద్రపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు చేసిందని, రైతులు తాము పండించిన పత్తిని ఆ కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందవచ్చునని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ సహాయ సంచాలకుడు పి.రవికిరణ్‌ సూచించారు.

పత్తిని ఇచ్చి మద్దతు ధర తీసుకోండి

క్వింటాకు రూ.7,521 చెల్లించనున్న సీసీఐ

రైతులకు మార్కెటింగ్‌ శాఖ ఏడీ సూచన

విజయనగరం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పత్తి రైతుల సౌకర్యార్థం రామభద్రపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు చేసిందని, రైతులు తాము పండించిన పత్తిని ఆ కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందవచ్చునని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ సహాయ సంచాలకుడు పి.రవికిరణ్‌ సూచించారు. ఈ నెల 18న ‘కలిసిరాని పత్తి’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్తపై కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఆరాతీశారు. వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ఏడీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏడీ రవికిరణ్‌ మాట్లాడుతూ, రైతులు పంటను దళారులకు విక్రయించి నష్టపోవద్దని కోరారు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తమ నిబంధనల మేరకు క్వింటాకు రూ.7,521 మద్దతు ధరను చెల్లించి కొనుగోలు చేస్తుందన్నారు. అయితే పత్తి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ముందు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. రైతులు ఆరబెట్టిన, శుద్ధి చేసిన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం ద్వారా సీసీఏ ప్రకటించిన మద్దతు ధర పొందవచ్చునన్నారు. పత్తి కొనుగోలుకు సంబంఽధించి, మరిన్ని వివరాలు, సందేహాల కోసం ఫోన్‌ నంబర్లు 91823 61390, 91823 61373లలో సంప్రదించాలన్నారు.

----------------

Updated Date - Nov 20 , 2024 | 11:48 PM