శంబరకు పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Mar 19 , 2024 | 11:19 PM
శంబరకు భక్తులు పోటెత్తారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం.. కోర్కెలు తీర్చే కల్పవల్లి పోలమాంబ దర్శనానికి బారులుదీరారు. తొమ్మిదో వారం జాతర సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ తదితర రాష్ర్టాల నుంచి భారీగా భక్తజనం తరలివచ్చారు.

పోలమాంబ దర్శనానికి బారులు
మక్కువ: శంబరకు భక్తులు పోటెత్తారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం.. కోర్కెలు తీర్చే కల్పవల్లి పోలమాంబ దర్శనానికి బారులుదీరారు. తొమ్మిదో వారం జాతర సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ తదితర రాష్ర్టాల నుంచి భారీగా భక్తజనం తరలివచ్చారు. దీంతో మంగళవారం వనం, చదురుగుడిలో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. గంటలకొద్దీ నిరీక్షించిన అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని పులకించిపోయారు. ‘పోలమాంబ.. కరుణించు’ అంటూ వేడుకున్నారు. అనంతరం వనం గుడి వద్ద వేప చెట్టుకు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. గోముఖీ నదీతీరాన కోళ్లు, చీరలతో మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు వనం గుడి సమీప తోటల్లో చెట్ల కింద వంటావార్పు చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే భోజనాలు చేశారు. ఈవో సూర్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.