ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తోటపల్లికి పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:27 AM

ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా పేరొందిన తోటపల్లి వేంకటేశ్వరస్వామి, కోదండరామసావమి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక నాలుగో శనివారం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా నుంచి భారీగా భక్తజనం తరలివచ్చారు.

స్వామివారి దర్శనానికి క్యూలో బారులుదీరిన భక్తులు

- మార్మోగిన గోవింద నామస్మరణ

గరుగుబిల్లి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా పేరొందిన తోటపల్లి వేంకటేశ్వరస్వామి, కోదండరామసావమి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక నాలుగో శనివారం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా నుంచి భారీగా భక్తజనం తరలివచ్చారు. తొలుత నాగావళి నదిలో స్నానాలు ఆచరించారు. ఆలయంలోని క్యూలైన్లలో గంటల కొద్దీ నిరీక్షించిన అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ఆలయ ప్రాంగణంలో పార్వతీపురం మండలం కొత్తపట్నం గ్రామానికి చెందిన సంతోషిమాత కోలాటం గ్రూపు సభ్యుల కోలాటం ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ, సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత ప్రసాదాలు అందించారు. అనంతరం అన్యదానం కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - Nov 24 , 2024 | 12:27 AM