ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కెంగువలో నలుగురికి డయేరియా

ABN, Publish Date - Oct 22 , 2024 | 12:25 AM

మండలంలోని కెంగువ గ్రామంలో నాలుగు డయేరియా కేసులు నమోదైనట్టు మరుపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి సా యికృష్ణ తెలిపారు.

గజపతినగరం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని కెంగువ గ్రామంలో నాలుగు డయేరియా కేసులు నమోదైనట్టు మరుపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి సా యికృష్ణ తెలిపారు. సోమవారం గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టారు. గ్రా మానికి చెందిన సుంకరి సింహాచలం, మండల సూరమ్మ, పెనుమజ్జి సత్యం డయేరియా బారినపడి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, శనపతి బంగారునాయుడు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం నుంచి వాంతులు, విరోచనాలతో ఇబ్బందులకు గురవు తున్న వ్యాధిగ్రస్థులను వైద్య సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఆర్‌డబ్ల్యూయస్‌ అధికారులు డీఈఈ తిరుపతిరావు, జేఈ శ్రీనివాసరావు వాటర్‌ ట్యాంక్‌నుంచి గ్రామానికి సరఫరా జరిగే తాగునీటి సరఫరాను నిలిపివేశారు. ఈ నీటి నమునాలను తీసి పరీక్షా కేంద్రాలకు పంపిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు తెలిపారు.

Updated Date - Oct 22 , 2024 | 12:25 AM