దీపావళి శోభ
ABN, Publish Date - Oct 30 , 2024 | 11:57 PM
దీపావళి పండగ వచ్చేసింది. ముందే జిల్లాకు కొత్త కళ తెచ్చేసింది. మందుగుండు సామగ్రి, పూజా దినుసులు కొనుగోలు చేసే వారితో బుధవారం సందడే సందడి కనిపించింది.
దీపావళి శోభ
మార్కెట్ కిటకిట
మండిపోతున్న మండుగుండు సామాన్ల ధరలు
విజయనగరం/ కలెక్టరేట్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):
దీపావళి పండగ వచ్చేసింది. ముందే జిల్లాకు కొత్త కళ తెచ్చేసింది. మందుగుండు సామగ్రి, పూజా దినుసులు కొనుగోలు చేసే వారితో బుధవారం సందడే సందడి కనిపించింది. మార్కెట్ కిటకిటలాడింది. నరకాసురని సంహరించిన రోజుగా.. చీకటి పోయి వెలుగు పంచే పండగగా చెడుపై మంచి విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకోవడం ఆనవాయితీ. అయితే మందుగుండు సామగ్రి ఏటా లాగే ధరలు నింగినంటాయి. మార్కెట్‌లో వివిధ డూప్లికేట్ కంపెనీల క్రాకర్స్ కూడా ధరను పెంచి అమ్ముతున్నారు. ఇప్పటికే జిల్లాలోని అనుమతి పొందిన వివిధ బాణసంచా దుకాణాల్లో మందుగుండు సామగ్రిని జోరుగా విక్రయిస్తున్నారు. మంగళ, బుధవారాల్లో చాలా మంది దీపావళి సామాన్లు కొనుగోలు చేశారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలోని కెఎల్‌పురంలో హోల్‌సేల్‌గా దీపావళి సామాన్లు విక్రయిస్తున్నారు. అత్యధికంగా అమ్మకాలు అక్కడే జరుగుతాయి. మరోవైపు దీపావళి అంటేనే శుభాలకు తోరణాలుగా పిలుస్తారు. పండగ రోజున లక్ష్మీదేవికి పూజిస్తారు. దీంతో కొబ్బరికాయలు, అరటిపండ్లు, పూలతో పాటు వివిధ రకాల పూజా సామగ్రి కొనుగోలుదారులతో మార్కెట్‌లు కిటకిటలాడాయి. మిఠాయి షాపులు, బంగారు, వస్త్ర దుకాణాలు, కిరాణా వ్యాపారాలు కళకళలాడాయి.
----------
Updated Date - Oct 30 , 2024 | 11:57 PM