ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ పని చేయం

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:20 AM

బదిలీపై వేరే ప్రాంతానికి వెళ్లిపోతామని చెప్పి చాలా మంది ఉద్యోగులు ప్రస్తుతం పని చేస్తున్న చోట ఎటువంటి కార్యకలపాలు నిర్వహించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

- కొత్తవారితో చేయించుకోండి

- ఇదీ బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల తీరు

- ప్రజలకు తప్పని ఇబ్బందులు

(కలెక్టరేట్‌)

-నేను బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకున్నాను. మీ పని చేసేందుకు కొంత సమయం పడుతుంది. ఈలోగా నేను ఇక్కడ నుంచి వేరే చోటకు బదిలీ అవుతాను. అందుకే ఇక్కడకు కొత్తగా వచ్చే అధికారితో మీ పని చేయించుకోవడం చాలా మంచిది.

- ఓ మండల స్థాయి అధికారి తనను కలిసేందుకు వచ్చిన ప్రజలతో అన్న మాటలు ఇవి.

- గంట్యాడ మండలానికి చెందిన ఓ రైతు ఇటీవల సచివాలయంలో గ్రామ రెవెన్యూ కార్యదర్శిని కలిశాడు. తన భూమి మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటానని, పరిష్కరించాలని రెవెన్యూ కార్యదర్శిని కోరాడు. దీనిపై స్పందించిన కార్యదర్శి.. ‘నేను ఇక్కడకి వచ్చి ఐదేళ్లు పూర్తయింది. బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఈ మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తి కావాలంటే నెల రోజులు సమయం పడుతుంది. ఈలోగా బదిలీలు ప్రక్రియ పూర్తయితే నేను వేరే చోటకు వెళ్లిపోతాను. అందుకే కొత్త కార్యదర్శి వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకోవడం మంచిదని’ రైతుకు సలహా ఇచ్చాడు.

జిల్లాలో ఇటువంటి సంఘటలు అనేకం ఉన్నాయి. బదిలీపై వేరే ప్రాంతానికి వెళ్లిపోతామని చెప్పి చాలా మంది ఉద్యోగులు ప్రస్తుతం పని చేస్తున్న చోట ఎటువంటి కార్యకలపాలు నిర్వహించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం గత నెల 15న జీవో ఇచ్చింది. అదే నెల 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని జీవోలో పేర్కొంది. దీంతో అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. బదిలీల ప్రక్రియ పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులు అంతా సిద్ధం చేశారు. అప్పట్లో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి లేఖలు తీసుకున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమకు కావల్సిన అధికారులను తెచ్చుకోవడానికి లేఖలను కూడా అందించారు. ఈ తరు ణంలో బదిలీల ప్రక్రియను ఈ నెల 15కు వాయిదా వేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ఉద్యోగులు నిరాశకు గురయ్యారు. పదిహేను రోజుల్లో మళ్లీ బదిలీల ప్రక్రియ మొదలుకానుందని భావించారు. అయితే, ఈ ప్రక్రియను మరోసారి ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 22 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం ఈనెల 12న మరో జీవో ఇచ్చింది. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర నైరాశ్యం ఆవహించింది. దీంతో ప్రసుత్తం పని చేస్తున్న చోట సక్రమంగా విధులు నిర్వహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బదిలీల ఆలోచనలతోనే వారు గడుపుతున్నారు. కొందరు ఉద్యోగులైతే వివిధ పనుల కోసం వస్తున్న ప్రజలతో ‘మేము బదిలీ అవుతాం. మీ పనులు చేయలేం.. కొత్త వారితో చేయించుకోండి’ అని కరాకండిగా చెబుతున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:20 AM

Advertising
Advertising